ప్రస్తుతం కరోనా రెండవ దశ భారతదేశాన్ని చిగురుటాకులా వణికిపోతోంది. ప్రజలందరూ ఈ మహమ్మారి పట్ల ఎంతో భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.ఈ వైరస్ తీవ్రరూపం దాల్చడంతో రోజురోజుకు అధికంగా కేసులు నమోదు అవడమే కాకుండా మరణాల సంఖ్య కూడా ఎక్కువగా నమోదవుతుంది. ఈ క్రమంలోనే ఎంతోమంది సరైన సమయంలో ఆక్సిజన్ లభించగా మృత్యువాత పడుతున్నారు.
తాజాగా ఉస్మానియా విద్యార్థి సంఘం నేత బెల్లంకొండ కృష్ణగౌడ్ కరోనా బారినపడి సోమవారం మృత్యువాత పడిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఆసుపత్రిలో తాను ఎదుర్కొన్న ఇబ్బందులను తన భార్యకు ఫోన్ చేసి చెప్పిన చివరి మాటలు వింటే కన్నీళ్లు ఆగవు. ఇతని మాటలు వింటే వైరస్ ఏ విధంగా ప్రజలను బలి తీసుకుంటుందో అర్థమవుతుంది.
సూర్యాపేట జిల్లా మునగాల మండలం నేలమర్రి గ్రామానికి చెందిన కృష్ణగౌడ్ ఓయూలో విద్యార్థి ఐకాస నేతగా ఉన్నారు. కొవిడ్ బారినపడిన ఆయన పది రోజుల క్రితం నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.ఆదివారం రాత్రి తన భార్యకు ఫోన్ చేసి తనని ఇక్కడ ఎవరూ పట్టించుకోలేదని, తనకు శ్వాస తీసుకోవడం ఎంతో ఇబ్బందిగా ఉంది కనీసం ఆక్సిజన్ కూడా పెట్టలేదని వెంటనే నన్ను ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లి బతికించమని తన భార్యను వేడుకున్నాడు.
కృష్ణ గౌడ్ పరిస్థితి విషమించడంతో సోమవారం ఉదయం నిమ్స్ లో కన్నుమూశారు. డాక్టర్లు మాత్రం అతనిని వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందించామని, అతని పరిస్థితి విషమం కావటం వల్లే ప్రాణాలు కోల్పోయారని తెలిపారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…