తెలుగు బుల్లితెరపై మకుటంలేని మహారాణి యాంకర్ గా యాంకర్ సుమ కనకాల పేరు వినిపిస్తుంది. అంతేకాకుండా యాంకర్ లో నెంబర్ వన్ యాంకర్ అన్న కూడా సుమ పేరే వినిపిస్తూ ఉంటుంది. ఈమె తన మాటలతో పిల్లలు పెద్దలు అనే భేదం లేకుండా అందర్నీ ఆకట్టుకోవడంలో దిట్ట. తెలుగు బుల్లితెర ప్రేక్షకులలో ఆమె తెలియని వారు లేరంటే అతిశయోక్తి కాదు. దూరదర్శన్ లో సీరియల్ తో పరిచయం అయిన యాంకర్ సుమ ప్రస్తుతం కెరీర్ ను నెట్టుకొస్తోంది.
అలాగే బుల్లితెరపై ప్రసారమయ్యే షోలలో ఎంత మంది గొప్ప హోస్టులు , యాంకర్స్ ఉన్న వారందరికీ ఆదిగురువు సుమ. దాదాపుగా రెండు దశాబ్దాలుగా తెలివిజన్ రంగం పై మకుటంలేని మహారాణిగా రానిస్తోంది. ఎక్కడో కేరళ నుంచి వచ్చి మొదట్లో తెలుగు మాట్లాడడానికి ఇబ్బంది పడిన ఇప్పుడు తెలుగు అమ్మాయిల కంటే స్పష్టంగా మాట్లాడగలుగుతున్నారు సుమ.
సినిమా వేడుక ఏదైనా కూడా ఆమె వాయిస్ వినిపించాల్సిందే. ఆమె యాంకరింగ్ తో ఆ వేడుకలు మారిపోతుందని చెప్పవచ్చు. ఎదుటివారితో ఇష్టంగా మాట్లాడుతూ, తన మాటలతో ఎవరికీ ఇబ్బంది పెట్టకుండా,అందరితో ఇట్టే కలిసిపోతుంది. ఇదిలా ఉంటే త్వరలోనే యాంకర్ సుమ వెండితెరపైకి అడుగు పెట్టబోతోంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.
ఇప్పటికే బుల్లితెర యాంకర్ లుగా రాణిస్తున్న అనసూయ, రష్మీ లు వెండితెర ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.వీరి లానే సుమ కూడా వెండితెరపైకి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. ఈ వార్త గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ విషయంపై తాజాగా సుమ క్లారిటీ ఇచ్చింది. ఒక వీడియో ద్వారా ఇదే విషయాన్ని తన స్టైల్లో తెలిపింది. కొందరు సెలెబ్రిటీలు తన గురించి మాట్లాడిన వీడియో క్లిప్స్ కట్ చేసి వీడియోని రెడీ చేసి ఇంతమంది అడుగుతున్నారు అంటే చేసేస్తే పోలే అనే సుమ తెలిపింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…