పిల్లలు, పెద్దలూ అందరూ కేరింతలు కొడుతూ సరదాగా జరుపుకునే పండుగలలో దీపావళి ఒకటి. ఈ దీపావళి పండుగ రోజున టపాసులు కాలుస్తూ, బాణాసంచాలు పేలుస్తూ ఆనందంలో మునిగి తేలుతూ ఉంటారు. ఈ వెలుగులు విరజిమ్మే దీపావళి పండుగలో భాగంగా టపాకాయలు కాల్చేక్రమంలో ఏమాత్రం అజాగ్రత్తగా వ్యవహరించినా జీవితాన్నే కోల్పోవాల్సి వస్తుంది. ముఖ్యంగా పిల్లల విషయంలో ఏమరపాటు పనికిరాదు. అందువల్ల కొన్ని జాగ్రత్తలు పాటించమని చెబుతూ ఉంటారు.
బాణాసంచాలు ఆకాశం అంచులకెళ్లి వెలుగులు కురిపిస్తాయి. చిచ్చుబుడ్లు పేలుతాయి. జగమంతా వెలుగులమయమవుతుంది. చీకటిని మాయంచేస్తూ వెలుగులు తెచ్చే పండుగగా, విజయానికి ప్రతీకగా ఈ దీపావళి పండుగను జరుపుకుంటారు. దీపమాళికల శోభతో ఊరువాడ కళకళలాడుతుంది. దీపావళి సోయగాలు వెల్లివిరుస్తాయి. దీపావళి అనగానే పిల్లలకు పెద్దలకు ఎక్కడలేని ఉత్సాహం వస్తుంది. ఆడుతూపాడుతూ చిందేస్తారు. వెలుగు దివ్వెల మధ్య పండుగ చేసుకుంటారు. సాయంత్రం టపాసులు కాల్చుతూ కేరింతలు కొడతారు.
దీపావళి పండుగ రోజు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మనం తెలుసుకుందాం.. ఇలా సరైన జాగ్రత్తలు తీసుకోకుండా గతంలో కూడా ప్రాణాలు పోయిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. దీపావళి సమయంలో కంటి రక్షణ కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం. బాణసంచా పేలుళ్ల కారణంగా కనుపాప కంటిని ఉపరితలంపై రసాయన, థర్మల్ గాయాలు ఏర్పడవచ్చు.దీనివల్ల కార్నియల్ ఒపాసిటీ,అందత్వం సంభవిస్తుంది. కొన్నిసార్లు లోపలి వరకు ఏర్పడే గాయాల వల్ల కంటి లోపలి భాగం చిరిగిపోవడం, ఏదైనా వస్తువు కంటిలోపల పడటం లాంటివి జరుగుతూ ఉంటాయి.
టపాసులు కాల్చే క్రమంలో వాటి నుంచి వెలువడే ఆ కాంతి వల్ల కంటి చూపు పోయే ప్రమాదం కూడా ఉంది.ఇక కంటికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు డాక్టర్ సలహా లేకుండా ఎటువంటి ఐ డ్రాప్స్ ను ఉపయోగించకూడదు. కళ్ళను రుద్దకూడదు. అలాగే టపాసులు కాల్చిన చేతులతో కళ్ళని శుభ్రం చేయకూడదు. అలాగే కళ్ళపై ఎటువంటి ఒత్తిడి పెట్టకూడదు. టపాసులు కాల్చేటప్పుడు కళ్ళజోడు పెట్టుకోవాలి.
ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…
తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…
భారత క్రికెట్‌లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…
నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…
ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…
హైదరాబాద్‌లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…