General News

వ్యవసాయ భూమి ఐదెకరాల కంటే ఎక్కువ ఉన్నవారికి షాకింగ్ న్యూస్..?

చాలామంది కేంద్ర ప్రభుత్వం వార్షిక ఆదాయాన్ని బట్టి ఆర్థికంగా వెనుకబడిన వర్గాల రిజర్వేషన్లను అమలు చేస్తుందని భావిస్తారు. అయితే కేంద్రం ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లకు వ్యవసాయ భూమిని కూడా పరిగణనలోకి తీసుకుంటుంది. ఒక కుటుంబానికి ఐదెకరాలు లేదా అంతకంటే ఎక్కువగా వ్యవసాయ భూమి ఉంటే ఆ కుటుంబంలో సభ్యులు ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లకు అర్హులు కాదు.

అదే సమయంలో వ్యవసాయ పొలంతో పాటు 1,000 చదరపు అడుగుల కంటే ఎక్కువ స్థలంలో నివాస గృహం లేదా ఫ్లాట్ ఉన్నా ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లకు అర్హత పొందలేరు. మున్సిపాలిటీలు, నోటిఫైడ్ పురపాలికలలో 100 చదరపు గజాలు, అంతకంటే ఎక్కువ స్థలంలో నివాస స్థలం ఉన్నా, గ్రామీణ ప్రాంతాల్లో 200 చదరపు గజాలు లేదా అంతకంటే ఎక్కువ విస్తీర్ణంలో నివాస స్థలం ఉన్నా ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లు వర్తించవు.

8 లక్షల రూపాయల లోపు సంవత్సర ఆదాయం ఉండటంతో పాటు ఈ పరిమితుల లోపు ఆస్తులు ఉంటే మాత్రమే ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లకు అర్హత పొందే అవకాశం ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్ల కింద రాని వారు ఈ విధంగా అర్హత పొందవచ్చు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్ల అమలుకు సిద్ధమైన నేపథ్యంలో కేంద్రం మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్రంలో ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్ల అమలు జరిగే అవకాశం ఉంటుంది.

ఈడబ్ల్యూఎస్‌ కోటాను ఎవరైతే కోరుకుంటారో వారి కుటుంబ సభ్యుల వేతనాలు, వ్యాపారం, వ్యవసాయం, వృత్తి, ఇతర మార్గాల నుంచి వచ్చే ఆదాయాన్ని కుటుంబ సభ్యుల ఆదాయంగా లెక్కిస్తారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago