Movie News

జంగిల్‌ మాన్‌ బాన్‌దేవ్‌గా అవతారమెత్తిన భల్లాలదేవుడు దగ్గుబాటి రానా..?

బాహుబలి సినిమాలో బల్లాలదేవుడిగా తాను తప్పా ఎవరు చేయలేరు అన్న రీతిలో దగ్గుబాటి రానా ఆ పాత్రలో ఒదిగిపోయాడు.. ఈ పాత్ర అనే కాదు తాను చేసిన సినిమాల్లోని పాత్రలన్నిటికి వందకు వంద శాతం న్యాయం చేకూరుస్తారు రానా..  లీడర్ సినిమా తో పరిచయమైన రానా ఒక్క తెలుగులోనే కాకుండా మిగిలిన భాషల్లో కూడా నటిస్తూ అక్కడ మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ఓ సాదా సీదా నటుడిగా మాత్రమే పరిచయమైనా రానా బాహుబలి తో ఇతను మాములు నటుడు ఏం కాదని ఆ సినిమా తో చెప్పేశాడు..

Actor Rana Daggubati.

బాహుబలి తో వచ్చిన క్రేజ్ తో ఆ సినిమా తర్వాత  రానా చేసిన ప్రతి సినిమా సూపర్ హిట్ అయ్యింది.. నేనే రాజు నేనే మంత్రి సినిమా అయితే టాలీవుడ్ రికార్డులు తిరగరాసింది అని చెప్పాలి.. ఈ సినిమా తో రానా కి క్రేజ్ మరింత పెరిగిపోయింది. ఇకపోతే రానా ప్రస్తుతం పాన్ ఇండియా మూవీ అయినా అరణ్య లో నటిస్తున్న విషయం తెలిసిందే.. ఈ సినిమా కి సంబందించి ట్రైలర్  ని కూడా ఇటీవలే భారీ స్థాయిలో రిలీజ్ చేసి సినిమా పై మంచి అంచనాలను ఏర్పరిచేలా ప్లాన్ చేశారు.. ఇదివరకే రిలీజ్ అయిన టీజర్ కి మంచి స్పందన వచ్చింది ట్రైలర్ తో అంచనాలు కూడా రెట్టింపు అయ్యాయి..

ఈ సినిమా కోసం రానా చాలా సాహసాలు చేశాడట..ఈ సినిమాలో రానా సన్నగా కనిపించబోతున్నాడు. భళ్లాలుడి నుంచి బాన్‌దేవ్‌గా మారేందుకు 30 కిలోల బరువు తగ్గాడు రానా. ఈ సినిమా కోసం ఎలా తగ్గుతున్నాడో రానానే స్వయంగా చెప్పేశాడు. భళ్లాలదేవుడి పాత్ర కోసం చాలా బరువు పెరిగా సినిమాలో బాన్‌దేవ్‌ పాత్ర కోసం ప్రభు సాల్మన్‌ బరువు తగ్గమని చెప్పారు. ఆ సినిమాలో ముప్పై ఏళ్ల పాటూ అడవిలోనే జీవించిన వ్యక్తిలా కనిపించేలా బరువు తగ్గడం అంత సులువు కాదు. సినిమాల్లోకి రావడానికి ముందు ఎంత కష్టపడి బరువు తగ్గానో… ఈ సినిమా కోసం అంతే కష్టపడ్డా.  సినిమా పూర్తవ్వగానే మళ్లీ కండలు పెంచుతా. నాకు బరువు పెరగడం, తగ్గడం కొత్త కాదు. సినిమాల్లోకి రాక ముందు 125 కిలోలు ఉండేవాణ్ని.  హీరో అవ్వాలంటే ఫిట్‌నెస్‌ చాలా అవసరం. హీరో పొట్టతో కనిపిస్తే ప్రేక్షకులు మెచ్చరు. అందుకోసం దాదాపు ఎనిమిది నెలలు కష్టపడి బరువు తగ్గా. వారంలో ఆరు రోజులు చాలా కఠినంగా డైట్‌ పాటించేవాణ్ని. ఒకరోజు మాత్రం నచ్చిన ఆహారాన్ని తినేవాణ్ని. అలా 20 కిలోలు తగ్గా. థియేటర్‌ క్లాసులకు, డ్యాన్సు క్లాసులకు హాజరయ్యా. స్టంట్స్‌ చేయడంలో కూడా శిక్షణకు వెళ్లా. బాహుబలి పూర్తయ్యాక కొన్ని నెలల పాటూ బరువు తగ్గడంపైనే దృష్టి పెట్టా అన్నారు..

TD Admin

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago