Daggubati Rana: టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన నిర్మాత సురేష్ బాబు, హీరో రానా దగ్గుబాటి కి తాజాగా కోర్టు నుండి పెద్ద షాక్ ఇచ్చింది. వారిపై క్రిమినల్ కేసు నమోదు చేసింది. దీంతో వారిని కోర్టుకు హాజరు కావాలని సమన్లు జారీ చేసింది. ఇంతకు అసలు విషయం ఏంటంటే.. గతంలో షేక్ పేట మండలం సర్వేనెంబర్..
403 లో సినీ నటి మాధవి 1007 గజాల స్థలంను నిర్మాత సురేష్ బాబుకు అమ్మింది. అయితే ఆ స్థలంను సురేష్ బాబు 2014లో అనే వ్యాపారికి హోటల్ ఏర్పాటు కోసం లీజుకి ఇచ్చాడు. అయితే 2018 ఫిబ్రవరిలో లీజు ముగుస్తుండగా ప్లాట్ నెంబర్ 2 లో ఉన్న స్థలాన్ని సురేష్ బాబు18 కోట్లకు అమ్మడానికి అంగీకరించాడు. దీంతో ప్రమోద్ కుమార్ ఐదు కోట్లు సురేష్ బాబుకు చెల్లించాడు.
ఇక లీజు ముగిసిన తర్వాత ఖాళీ చేయటం లేదు అని కేసు కూడా వేశారు సురేష్ బాబు. దీంతో ప్రమోద్.. తన వద్ద రూ. ఐదు కోట్లు అడ్వాన్స్ గా తీసుకొని రిజిస్ట్రేషన్ చేయలేదని కోర్టును ఆశ్రయించారు. అయితే ఆ కోర్టు కేసులు తేలకముందే ఆ స్థలాన్ని సురేష్ బాబు రానాకు విక్రయించాడు.
దీంతో బంజారాహిల్స్ పోలీసులు ఈ విషయం గురించి చర్యలు తీసుకోకపోవడంతో నాంపల్లి కోర్టులో ప్రైవేట్ ఫిర్యాదు దాఖలు చేశారు. ఇక వెంటనే కోర్టు సురేష్ బాబును, రానా ను వ్యక్తిగతంగా హాజరు కావాలి అని జనవరి 19న సమన్లు జారిచేసింది. ఇక తర్వాత విచారణ మే ఒకటికి వాయిదా వేయగా ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ వార్త బాగా హాట్ టాపిక్ గా మారింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…