Pawan Kalyan: టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ తర్వాత వరుస సినిమాలతో బాగా దూసుకుపోతున్నాడు. ఒక వైపు రాజకీయంపరంగా బిజీగా ఉంటూనే మరోవైపు వచ్చిన సినిమాలకు సైన్ చేసుకుంటూ పోతున్నాడు. ఇక రీ ఎంట్రీ తర్వాత వరుస సక్సెస్ లు అందుకోవటంతో.. దర్శక నిర్మాతలు కూడా పవన్ కళ్యాణ్ కోసం ఎదురుచూస్తున్నారు.
ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఖాతాలో వరుస సినిమాలు ఉన్నాయి. బిజీ షెడ్యూల్ తో ఉన్నప్పటికీ కూడా ఆ మధ్యనే డైరెక్టర్ సుజీత్ తో ఓ సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు పవన్. సాహో తో మంచి సక్సెస్ అందుకున్న సుజీత్ పవర్ స్టార్ తో మరో సినిమా ప్లాన్ చేయటంతో అందరిలో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ సినిమాను ఒరిజినల్ గ్యాంగ్ స్టార్ అనే పేరుతో ముందుకు తీసుకురానున్నారు.
ఇక జనవరి 30న ఈ సినిమా మూవీ ఓపెనింగ్స్ కూడా ఘనంగా జరిగింది. అయితే ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ తీసుకోనున్న పారితోషకం బాగా వైరల్ అవుతుంది. ఈ సినిమాకు పవన్ కళ్యాణ్ ఏకంగా రూ.75 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకోనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అదే కాకుండా ఈ సినిమాకు వచ్చే లాభాల్లో మూడో వంతు కూడా తీసుకోవడానికి అగ్రిమెంట్ చేసుకున్నాడట పవన్.
ఇక ఈ సినిమా నిర్మాణ వ్యయానికి, పవన్ కళ్యాణ్ రెమ్యూనరేషన్ కూడితే 175 కోట్ల వరకు అవుతుంది. మరి ఈ సినిమా 200 కోట్లకు పైగా మార్కెట్ చేస్తే అంతా సేఫ్. లేదంటే నిర్మాతలకు చుక్కలే. కానీ ఈ సినిమా ఎలాగైనా 200 కోట్ల పైగా మార్కెట్ చేస్తుంది అని నమ్మకం ఉంది. ఎందుకంటే సుజీత్ – పవన్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాబట్టి అంచనాలు ఎక్కువగా ఉన్నాయి.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…