Dammaigudem Indhu death mistery : తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది చిన్నారి ఇందు మరణం. స్కూల్ కి వెళ్లిన అమ్మాయి శవంగా తిరిగి రావడంతో ఆ తల్లిదండ్రులు గుండెలు అవిసేలా రోదిస్తున్నారు. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ ఎన్టీఆర్ కాలనీకి చెందిన ఇందు అనే చిన్నారి దమ్మాయిగూడెం చెరువులో శవంగా కనిపించింది. తన మరణానికి గల కారణాలు ఇంకా సస్పెన్స్ గా ఉన్నాయి. స్కూల్ కి వెళ్లిన చిన్నారి మరుసటి రోజు ఉదయం చెరువులో శవమై తేలింది. తానే చెరువు వద్ద ప్రమాదవశాత్తు పడి మరణించి ఉండొచ్చని పోలీసులు చెబుతున్నా ఇందు తల్లిదండ్రులు మాత్రం ఎవరో చంపి చెరువులో వేసారంటూ ఆరోపిస్తున్నారు. సకాలంలో పోలీసులు స్పందించి ఉంటే ఇందు బ్రతికేదని స్థానికులు పోలీసుల తీరుపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఎవరో చంపి చెరువులో వేశారు… మాకు న్యాయం జరగాలి…
ఇందు మరణం వెనుక ఇంకా మిస్టరీ వీడలేదు. అయితే పోలీసులు మాత్రం ప్రమాదవశాత్తు చెరువులో పడి మరణించి ఉండొచ్చని చెబుతున్నారు. కానీ ఇందు తల్లిదండ్రులు, స్థానికులు మాత్రం తాను చెరువులో పడి మరణించలేదని ఎవరో చంపి, చెరువులో వేసారంటూ ఆరోపిస్తున్నారు. పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇందు చిన్న పిల్ల అయినా చాలా తెలివైన పిల్ల అని, చెరువు దగ్గరికి వెళ్ళవల్సిన పని లేదని, చాలా జాగ్రత్తగా ఉంటుందంటూ స్థానికులు చెప్తుండగా, స్కూల్ కి వెళ్తున్నపుడు చివరగా ఇందు తో మాట్లాడానని ఇలా శవమై ఇంటికి వస్తుందని అనుకోలేదంటూ ఇందు తల్లి రోదిస్తోంది. ఇక తమ బిడ్డకు న్యాయం చేయాలని మాత్రమే మేము డిమాండ్ చేస్తున్నాం అంటూ ఇందు తల్లిదండ్రులు అడుగుతున్నారు.
పోలీసులు చెరువులో ఇందు శవం దొరికాక కనీసం తల్లిదండ్రులకు చూపించలేదని, గాంధీ హాస్పిటల్ కి తీసుకెళ్ళేటపుడు కూడా పాప తరుపున వాళ్ళను తీసుకుపోలేదని వెంటపడి గొడవ చేసినా అంబులెన్సులో ఎక్కించుకోలేదంటూ స్థాసనికులు ఆరోపించారు. పాప ఒంటి పై గాయాలు ఉన్నాయని కానీ పోలీసులు మాత్రం గాయాలు లేవని ఊపిరి తిత్తుల్లో నీరు చేరి పాప మరణించిందంటూ రిపోర్ట్ వచయిందని చెబుతున్నారంటూ అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాపకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…