Arundathi Movie: టాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అనుష్క ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కొన్ని సంవత్సరాలకే అరుంధతి వంటి లేడీ ఓరియంటెడ్ చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.కెరియర్ మొదట్లోనే ఇలాంటి ప్రయోగాత్మక చిత్రాలు చేయాలంటే ఎంతో సాహసం ఉండాలి అయితే ఈ సినిమా అనుష్కకు ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించి పెట్టింది.
ఇకపోతే అనుష్క కన్నా 10 సంవత్సరాలు ముందుగానే అరుంధతి సినిమాలో సీనియర్ దివంగత నటి సౌందర్య నటించిన విషయం చాలామందికి తెలియదు. అయితే సౌందర్య నటించిన ఈ అరుంధతి సినిమా ఫ్లాప్ అవడంతో పెద్దగా ప్రేక్షకులు ఈ చిత్రాన్ని గుర్తించలేదు.
సౌందర్య ప్రధాన పాత్రలో 1999 లో అమ్మా ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ మీద.. పాపులర్ యాక్టర్ కాస్ట్యూమ్స్ కృష్ణ సమర్పణలో.. కొల్లి వెంకటేశ్వర రావు నిర్మించారు. ఇక ఈ చిత్రాన్ని ప్రముఖ రచయిత దర్శకుడు క్రాంతి కుమార్ దర్శకత్వం వహించారు. మహిళా ప్రాధాన్యత చిత్రాలను చేయడంలో ఎంతో అనుభవం కలిగినటువంటి క్రాంతి కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.
శ్రీవిద్య సౌందర్య తల్లికూత్రులుగా కనిపించారు. అయితే శ్రీవిద్య తన సొంత తల్లికాదని తెలుసుకున్న సౌందర్య సొంత తల్లిదండ్రుల కోసం అన్వేషణ మొదలు పెడుతుంది. ఈ అన్వేషణలో ప్రేమ చిగురించడం వంటి కథ నేపథ్యంతో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమాలో కాస్త ఓవర్ డ్రామా ఉండడంతో ఈ సినిమాని పెద్దగా ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోయారు. ఇక క్లైమాక్స్ లో సౌందర్య శ్రీవిద్య ఇద్దరు చనిపోవడం కాస్త బాబోద్వేగానికి గురిచేస్తుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…