Deepika Padukone: బాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ నటిగా అగ్ర తారగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న దీపిక పదుకొనే అందరికీ సుపరిచితమే అయితే గత కొద్ది రోజులుగా ఈమె సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలో నిలుస్తున్నారు. అందుకు గల కారణం ఈమె షారుఖ్ ఖాన్ తో కలిసి నటిస్తున్న పఠాన్ సినిమా కారణమని చెప్పాలి.
ఈ సినిమాలో షారుఖ్ ఖాన్ సరసన ఈమె నటించడమే కాకుండా ఇందులో దీపికా పదుకొనే అందాల ఆరబోత ఎక్కువగా ఉందని ఇప్పటికే ఎంతోమంది విమర్శలు చేశారు. ఈ సినిమాలో దీపిక పదుకొనే ఏకంగా బికినీ ధరించి నటించడంతో విమర్శలు అధికమయ్యాయి. ఇప్పటికే ఎంతోమంది సినీ రాజకీయ ప్రముఖులు ఈమె వస్త్రధారణ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
తాజాగా బాలీవుడ్ నటుడు ముఖేష్ కన్నా దీపిక పదుకొనే వస్త్రధారణ గురించి స్పందించి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ సందర్భంగా ముఖేష్ కన్నా స్పందిస్తూ దీపిక సినిమాలలో అశ్లీలత ఎక్కువైంది అంటూ ఆరోపణలు చేశారు. బహుశా ఇకపై ఈమె నగ్నంగా నటిస్తారేమో అంటూ ఈయన కామెంట్ చేశారు.మనది భారతదేశం మన దేశంలో ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాల గురించి ఇతర దేశాలలో చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు అలాంటి మంచి పేరును చెడగొట్టదని ఈయన తెలిపారు.
ఇక ఈ సినిమాలో దీపికా పదుకొనే వస్త్రధారణ గురించి విమర్శలు చేస్తూనే సెన్సార్ బోర్డుపై కూడా ఈయన ఆరోపణలు చేశారు. సెన్సార్ బోర్డ్ అసలు పని చేస్తుందో లేదో తెలియడం లేదుఅంటూ సెన్సార్ బోర్డు సభ్యులపై కూడా ఈయన మండిపడ్డారు ప్రస్తుతం ఇందుకు సంబంధించినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే బాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ విధమైనటువంటి వివాదాలు తలెత్తడం సర్వసాధారణం.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…