Manchu Manoj: తెలుగు చిత్ర పరిశ్రమలో నటుడిగా మంచి గుర్తింపు పొందిన మనోజ్ ఈ మధ్యకాలంలో ఎలాంటి సినిమాలలో నటించలేదు. ఈ క్రమంలోనే మనోజ్ మొదటిసారిగా ప్రణతి అనే అమ్మాయిని వివాహం చేసుకొని పలు మనస్పర్ధల కారణంగా పెళ్లైన రెండు సంవత్సరాలకి విడాకులు తీసుకొని విడిపోయారు. ఈ విధంగా మనోజ్ ప్రణతి విడిపోవడంతో ప్రణతి అమెరికాలో స్థిరపడ్డారు.
ఇక మనోజ్ ఒంటరిగా గడుపుతున్నప్పటికీ ఎలాంటి సినిమాలలో నటించకపోవడంతో ఇక మనోజ్ సినిమాలకు దూరమయ్యారంటూ వార్తలు వచ్చాయ. అయితే మనోజ్ మాత్రం ప్రముఖ రాజకీయ నాయకుడు దివంగత నేత భూమా నాగిరెడ్డి రెండో కుమార్తె భూమా మౌనికతో రిలేషన్ లో ఉన్నారంటూ వార్తలు వచ్చాయి.
తాజాగా ఈయనకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.అయితే ఈ వార్తలకు బలం చేకూరేలా వీరిద్దరూ పలు ఆలయాలను సందర్శించడమే కాకుండా ఈ విషయంపై మనోజ్ స్పందిస్తూ జీవితానికి సంబంధించిన ముఖ్య విషయాన్ని మంచి రోజు చెబుతాను అంటూ కామెంట్ చేయడంతో వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని కూడా అర్థమైంది.
ఇక తాజాగా శోభ నాగిరెడ్డి జయంతి వేడుకలలో కూడా పాల్గొని సందడి చేశారు. ఇకపోతే కడప దర్గాను దర్శించుకున్నటువంటి మనోజ్ త్వరలోనే కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నానని తెలిపారు. అయితే సన్నిహితుల సమాచారం ప్రకారం మనోజ్ మౌనిక రెండవ వివాహం ఫిబ్రవరి 2వ వారంలో జరగనుందని తెలుస్తోంది. అయితే త్వరలోనే ఈ విషయం గురించి అధికారికంగా కూడా ప్రకటించనున్నట్లు సమాచారం.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…