Featured

Damu Balaji & Dasari Vignan : నిహారిక ఎలా దొరికిపోయింది… ఎలాంటి శిక్ష నిహారిక, హాసన్ లకు పడవచ్చు…: దాసరి విజ్ఞాన్ & దాము బాలాజీ

Damu Balaji &Dasari Vignan : అబుల్లాపూర్ మెట్ లో జరిగిన బిటెక్ నాలుగో సంవత్సరం చదువుతున్న నవీన్ అనే యువకుడి హత్య కేసు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో సంచలంగా మారింది. ప్రేమించిన అమ్మాయి కోసం ప్రాణ స్నేహితుడిని అత్యంత పాశవికంగా చంపాడు హరిహర కృష్ణ అనే యువకుడు. తన ప్రియురాలు నిహారిక రెడ్డి తో చనువుగా ఉన్నాడన్న కోపంతో పార్టీకి అని పిలిచి అక్కడ గొడవ పడి దారుణంగా నవీన్ హత్య చేసి తల, మొండేం వేరు చేసి గుండెను మార్మాంగాలను అలానే వేళ్ళను సెపరేట్ చేసి ప్రియురాలికి వాట్సాప్ లో ఫోటో తీసి పంపాడు. అయితే ఈ కేసులో రోజుకో కొత్త కోణం బయటికి వస్తోంది. నిహారిక రెడ్డికి అలాగే హరిహర ఇద్దరికి శిక్ష పడాలి అంటూ నవీన్ కుటుంబం కోరుకుంటోంది. ఇక నిహారికను అదుపులోకి తీసుకున్న పోలీసులు అసలు నిహారికను ఎలా పట్టుకున్నారు, ఎలాంటి క్లూస్ వాళ్లకు దొరికాయి అనే విషయాలను అనలిస్ట్ దాము బాలాజీ అలాగే దాసరి విజ్ఞాన్ వివరించారు.

ఆ విషయాలే నిహారికను పట్టించాయి…

మొదటి నుండి నవీన్ హత్య కేసులో నిహారికను అరెస్టు చేయాలని డిమాండ్ ఉండగా సరైన ఆధారాల కోసం పోలీసులి ఎదురుచూశారు. అయితే హత్య తరువాత నిహారిక హరిహర కలవడం, హత్య జరిగిన చోటుకు వెళ్లడం వంటి విషయాలు తెలియడంతో పోలీసులు నిహారికను అరెస్టు చేసారు. ఇక ఈ విషయాలను దాసరి విజ్ఞాన్ అలాగే దాము బాలాజీ విశ్లేషిస్తూ నిహారిక ప్రేరేపించి నవీన్ హత్యకు కారణం అయింది. కానీ హరిహర మాత్రమే నవీన్ ను హత్య చేసాడు అంటూ చెప్పారు. అయితే హత్య తరువాత హరిహర నిహారికను కలిసి మళ్ళి హత్య జరిగిన చోటుకు తీసుకువెళ్లి అక్కడి నుండి రెస్టారెంట్ కి వెళ్లి భోజనం చేసారు.

అయితే నిహారిక హరిహరకు హత్య తరువాత ఖర్చులకు 1500 డబ్బులు ఇచ్చింది. ఇది భయపడి ఇచ్చిందని అనుకున్నా మళ్ళీ హరిహర పిలిస్తే అతనితో హత్య జరిగిన ప్లేసుకి వెళ్లడం, ఆ తరువాత ఇద్దరూ రెస్టారెంట్ కి వెళ్లి భోజనం చేయడం అన్నీ కూడా నిహారిక భయపడి చేయలేదు అనడానికి ఆధారాలు అంటూ చెప్పారు. అయితే నిహారిక తరుపున లాయర్ కోర్ట్ లో హరిహర బెదిరించి నాతో డబ్బు తీసుకున్నాడు అని వాదించవచ్చు అలా చేస్తే నిహారికకు శిక్ష తగ్గుతుంది అంటూ అభిప్రాయాపడ్డారు. ఇక ఈ కేసులో హాసన్ అమాయకుడు లాగా అనిపిస్తున్నాడు కొంత అంటూ అభిప్రాయపడ్డారు దాము బాలాజీ అలాగే దాసరి విజ్ఞాన్. హాసన్ హరిహరకు భయపడి హెల్ప్ చేసాడు నిహారిక లాగా ఉద్దేశపూర్వకంగా ఆ పని చేయలేదు అంటూ అభిప్రాయపడ్డారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago