Janhvi Kapoor: జాన్వి కపూర్ పరిచయం అవసరం లేని పేరు అందాల నటి శ్రీదేవి వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈమె ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇలా బాలీవుడ్ ఇండస్ట్రీకే పరిమితమైనటువంటి ఈమె సౌత్ సినిమాలలో నటిస్తే చూడాలని ఎంతోమంది అభిమానులు ఎదురు చూశారు అయితే ఈమె సౌత్ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
ఈ క్రమంలోనే కొరటాల శివ ఎన్టీఆర్ కాంబినేషన్లో వస్తున్నటువంటి ఎన్టీఆర్ 30 సినిమాలో హీరోయిన్ గా జాన్వీ కపూర్ హీరోయిన్ అని వార్తలు వచ్చాయి అయితే ఇదే నిజమని తాజాగా ఆమె పుట్టిన రోజు సందర్భంగా ఒక పోస్టర్ ను విడుదల చేస్తూ చిత్ర బృందం అధికారకంగా ప్రకటించారు. ఇక ఈమెకు తెలుగులో ఇది మొదటి సినిమా అని చాలామంది భావించారు.
చాలామందికి తెలియని విషయం ఏమిటంటే ఈమె ఎన్టీఆర్ సినిమాతోనే తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టలేదని అంతకుముందే ఇతర టాలీవుడ్ హీరోలతో కలిసి ఈమె ఓ ప్రాజెక్టులో నటించారని చాలామందికి తెలియదు. మరి ఎన్టీఆర్ సినిమా కన్నా ముందుగా జాన్వీ కపూర్ ఏ టాలీవుడ్ హీరోతో ఏ సినిమాలో నటించారు ఏంటి అనే విషయానికి వస్తే…
దగ్గుబాటి హీరోలు రానా, వెంకటేష్ నటిస్తున్నటువంటి తాజా వెబ్ సిరీస్ రానా నాయుడు.ఈ వెబ్ సిరీస్ లో జాన్వి కపూర్ కూడా నటించారనే విషయాన్ని తాజాగా ఆమె పుట్టినరోజు సందర్భంగా నెట్ఫ్లిక్స్ ఒక వీడియోని విడుదల చేశారు. ఇందులో ఏదో సమస్యలో ఉన్నటువంటి జాన్వీ కపూర్ ను రానా వచ్చి కాపాడినట్లు చూపించారు. ఇలా ఈమె ఎన్టీఆర్ సినిమా కన్నా ముందుగానే రానా నాయుడు వెబ్ సిరీస్ లో నటించారని ఈ వీడియో ద్వారా మేకర్ ప్రకటించారు. ఇక ఈ వెబ్ సిరీస్ మార్చ్ 10వ తేదీ నెట్ ఫ్లిక్స్ లో విడుదల కానుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…