Featured

Dasari Vignan : అనసూయ దే తప్పు.. లైగర్ ప్లాప్ అవ్వడానికి విజయ్ కారణమా.. అనసూయ ట్వీట్స్ పై స్పందించిన సినిమా క్రిటిక్ దాసరి విజ్ఞాన్..!

Dasari Vignan : లైగర్ సినిమా బాగుంది, హిట్ అన్న టాక్ వినడం గురించి పక్కన పెడితే సినిమా ప్లాప్ అని ఒకరోజుకే చెప్పేస్తున్నారు. అయితే సినిమా మిశ్రమ స్పందనతో నడుస్తోంది. కానీ కొన్ని రివ్యూలు విశ్లేషణలు మాత్రం సినిమా ప్లాప్ అన్నట్లు మొదటి రోజుకే చెప్పేస్తున్నారు. ఇక విజయ్ మీద పూరీ మీద చాలా ట్రోల్స్ కూడా వస్తున్నాయి. కానీ యాంకర్ అనసూయా పెట్టిన ఒక ట్వీట్ మాత్రం మళ్ళీ చర్చకు దారితీసింది. అర్జున్ రెడ్డి టైములో వచ్చిన వివాదం మళ్ళీ తెర మీదకు తెచ్చింది అనసూయ ఒక్క ట్వీట్ తో, దీంతో మళ్ళీ ఆ విషయం గురించి చర్చించుకుంటున్నారు.

అయిపోయిన సంఘటన ఇప్పుడెందుకు మళ్ళీ లేవనేత్తడం…

‘అర్జున్ రెడ్డి’ సినిమా ఆడియో విడుదల సమయంలో విజయ్ ఫ్యాన్స్ తో బూతి పదాన్ని చెప్పించడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేసారు. ఇక ఈ విషయంలో చాలా ఘాటుగా అప్పట్లో అనసూయ మాట్లాడింది. అయితే అదంతా ముగిసిపోయి మళ్ళీ విజయ్ నిర్మాణం లో ‘మీకు మాత్రమే చెప్తా’ సినిమాలో నటించింది కూడా అనసూయ కానీ ఇన్నాళ్లకు మళ్ళీ పరోక్షంగా విజయ్ ను అనడంతో చర్చ మొదలైంది. అనసూయ ట్వీట్ చేస్తూ కర్మ ఎవరినీ వదలదు కొంచెం ఆలస్యం అవ్వచ్చు కానీ కచ్చితంగా అనుభవిస్తారు అంటూ ట్వీట్ చేసింది.

ఇక ఇష్యూ మీద సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ మాట్లాడుతూ ఎప్పుడో జరిగిపోయిన విషయాన్ని ఇప్పుడు మళ్ళీ ఎందుకు లేవనెత్తడం, లైగర్ సినిమా సరిగా ఆడకపోవడానికి విజయ్ మాత్రమే ఎలా కారణం. ఇకపోతే అనసూయ జబర్దస్త్ లాంటి కామెడీ షో చేసేటపుడు ఎలాంటి డబల్ మీనింగ్ డైలాగులు వాడలేదు? ఇతరులను బాడీ షేమింగ్ చేసినపుడు నవ్వలేదా, మరి వాటికంటే పెద్దదా ఈ విషయం. అయినా అర్జున్ రెడ్డి సమయంలో జరిగింది ఇది అప్పుడు ఖండించారు అయిపోయింది మళ్ళీ ఇపుడు మాట్లాడటం ఆ విషయాన్ని ఎత్తడం తప్పు. ఆల్రెడీ సినిమా ఆశించినంత ఆడలేదనే బాధలో ఉంటే మళ్ళీ ఇదేంటి అంటూ అభిప్రయపడ్డారు దాసరి విజ్ఞాన్.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago