Comedian Ali : నిండు నూరేళ్లు, సీతాకోక చిలుక వంటి సినిమాలతో చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ను ప్రారంభించిన అలీ, టాలీవుడ్ లో ప్రముఖ కమెడియన్ గా పేరు తెచ్చుకున్నాడు. కమెడియన్ గా మాత్రమే కాకుండా, నటుడుగా కూడా అభిమానులతో మార్కులు వేయించుకున్నాడు. ఇక బుల్లితెర మీద కూడా పలు టీవీ ప్రోగ్రాములకు హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. అలీ భార్య పేరు జుబేదా అలీ కాగా వీరికి ముగ్గురు సంతానం. ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు. పెద్ద కుమార్తె ఈ మధ్యనే డాక్టర్ పట్టా పొందిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అలీ పెద్ద కుమార్తె నిశ్చితార్త వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి.
పలువురు సెలబ్రిటీలు, కుటుంబ సభ్యుల సమక్షంలో…
అలీ సతీమణి జుబేదా అలీ గురించి సోషల్ మీడియా ఫాలో అయ్యేవారికి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈమె తన యుట్యూబ్ ఛానల్ ద్వారా వంటల వీడియోలు, హోమ్ టూర్లూ, స్పెషల్ వీడియోలు అంటూ అభిమానులకు దగ్గర అయింది. ఈమె ఛానల్ కు 5 లక్షల మంది సబ్‌స్క్రైబర్స్ ఉండటం విశేషం. ఇక ఈ మధ్య వాళ్ళ అమ్మాయి నిశ్చితార్తం అంటూ షాపింగ్ వీడియోలతో ఆకట్టుకుంది.
ఈ వీడియోలకు అభిమానుల నుండి ఆదరణ లభించడమే కాకుండా అందరూ ఈ వేడుక ఎపుడు వుంటుందా అని ఆసక్తిగా ఎదురు చూసారు. అలీ కూతురి నిశ్చితార్తం ఒక ఫంక్షన్ హాల్ లో అంగరంగ వైభవంగా జరుగగా, ఈ వేడుకకు బ్రహ్మానందం, సాయి కుమార్ వచ్చి ఆశీర్వదించడం జరిగింది. జుబేదా అలీ ఈ వేడుకకు సంబందించిన వీడియోని తన యూట్యూబ్ ఛానల్ లో అభిమానులతో పంచుకుంది. అందరినీ పరిచయం చేస్తూ సాగే ఈ వీడియో నెట్లో వైరల్ అవుతోంది.
ప్రకృతిలో జరిగే కొన్ని ఖగోళ అద్భుతాలు మన కళ్లకు నేరుగా కనిపించకపోయినా వాటి ప్రభావాన్ని మాత్రం మనం స్పష్టంగా అనుభవిస్తాం.…
చిన్న వయసులో ఆరోగ్యం గురించి పెద్దగా ఆలోచించని వారు చాలా మంది ఉంటారు. "ఇప్పుడేం కాదు.. తర్వాత చూసుకుందాం", "ఇంకా…
ఈ రోజుల్లో డబ్బు లేకుండా ఏ పని జరగని పరిస్థితి. ఉదయం ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టిన దగ్గర…
మన తెలుగు వంటింట్లో కరివేపాకుకు ప్రత్యేక స్థానం ఉంది. పప్పు నుంచి పులుసు వరకు, చట్నీ నుంచి ఫ్రై వరకు…
హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…
వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…