Imandhi Ramarao : ప్రస్తుతం వీకెండ్ కు లైగర్ సినిమా గురించి చర్చిస్తున్నారు. ఎన్నో అంచినాల నడుమ విడుదల అయిన లైగర్ సినిమా అంచనాలను అందుకో లేదని పబ్లిక్ లో వినిపిస్తున్న టాక్. మొదటి ర్పజు నుండే డివైడ్ టాక్ తో వెళ్తోంది లైగర్. కొంతమంది సినిమా యావరేజ్ చూడొచ్చి అని చెబోతుంటే మరికొంతమంది బాగోలేదు సినిమా అని చెబుతున్నారు. కానీ సినిమా గురించి రివ్యూలు, విశ్లేషణల పేరుతో పోస్ట్ మార్టం మాత్రం బాగా చేస్తున్నారు. సినిమా కోసం చేసిన ప్రమోషన్స్ టైములో విజయ్ ప్రవర్తన పూరీ మాటలు వీటిమీద బాగా ట్రోల్స్ కుడా కనిపిస్తున్నాయి. ఇక వీటి మీద సీనియర్ జర్నలిస్ట్ ఇమంది రామరావు గారు మాట్లాడారు.
పూరీ అజాగ్రత్త వల్ల విజయ్ కెరీర్ పోయింది…
సినిమా వైఫల్యానికి పూరీ జగన్నాథ్ అజాగ్రత్త కారణం. ఒకప్పుడు సినిమా తీసే పూరీ ఇపుడు లేదని అనిపిస్తుంది. అప్పుడు ఉన్న క్రియేటివిటీ ఇప్పుడు కనిపించడం లేదు. లైగర్ సినిమా ‘అమ్మ నాన్న తమిళ అమ్మాయి’ లాగా ఉన్నా హిట్ అయ్యుండేది. కానీ సినిమా లో కథ కథనం గాడి తప్పాయి. అసలు సినిమా ఎలా స్టార్ అయింది ఎలా ఎండ్ అయింది అనేది సంబంధం లేకుండా డైరెక్టర్ చేసాడు. పూరీ అజాగ్రత్త వల్ల విజయ్, పూరీ జగన్నాథ్, ఛార్మి ముగ్గురి జీవితాన్ని రిస్క్ లో పెట్టాడు. ఇస్మార్ట్ శంకర్ తో వచ్చిన విజయానికి లైగర్ ఒక మంచి అవకాశం కానీ దాన్ని పూరీ సద్వినియోగం చేసుకుని ఉంటే నెక్స్ట్ లెవెల్ లో ఉండేవాడు.
కానీ ఇపుడు పూర్తిగా కెరీర్ నాశనం చేసుకున్నాడు. ఒక క్రియేటివ్ డైరెక్టర్ ఇలా పతనం అవ్వడం నచ్చడం లేదు. పాపం ఛార్మి సినిమా మీద చాలా అంచనాలతో అప్పులు అక్కడ ఇక్కడ చేసి సినిమా నిర్మించింది ఇక మళ్ళీ వారి లైఫ్ చీకటిలోకి వెళ్ళిపోయింది. ఇక విజయ్ తన కెరీర్ ఒక స్టెప్ ముందుకు వెళ్తాడు అనుకుంటే వెనక్కు వచ్చాడు. కానీ విజయ్ ది తప్పని అనలేం, విజయ్ కాకుండా ఆ సినిమాలో తారక్ ప్రభాస్ ఎవరు ఉన్నా హీరోగా ఇలానే ఫలితం ఉండేది, ఇది పూరీ వైఫల్యం. కనీసం సినిమా బైయర్స్ కి నష్టాలు రాకుండా ఆడితే బాగుంటుంది అంటూ అభిప్రాయపడ్డారు ఇమంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…