Featured

Sangeetha : నన్ను డబ్బులు సంపాదించే వస్తువుగా వాడుకుంది… తల్లి అంటే ఎలా ఉండకూడదో మా అమ్మని చూసి నేర్చుకున్నా… ఆవేదన వ్యక్తం చేసిన సంగీత

Sangeetha : అచ్చమైన తెలుగు అమ్మాయిలా, ఒక్క ఛాన్స్ ఒకే ఒక్క ఛాన్స్ అనే డైలాగ్ తో మొదటి సినిమా తోనే అందరినీ ఆకట్టుకుంది సంగీత. ‘ఖడ్గం’ సినిమాతో తెలుగులో పరిచయం అయిన సంగీత పెళ్ళాం ఊరెలితే, విజయేంద్ర వర్మ, ఈ అబ్బాయి చాలా మంచోడు, శివపుత్రుడు వంటి సినిమాలలో నటించి అభిమానులను ఆకట్టుకుంది. కొన్ని సినిమాలలో నటించడం, పరాజయాల కారణంగా ఫేడ్ అవుట్ అయిపొయింది. తరువాత సింగర్ క్రిష్ ను పెళ్లి చేసుకొని తన సమయాన్ని కుటుంబంతో గడుపుతోంది. అయితే సరిలేరు మీకెవ్వరు, ఆచార్య సినిమాలతో మళ్ళీ సినిమాలలోకి రీఎంట్రీ ఇచ్చింది. అయితే గతంలో సంగీత జీవితంలో జరిగిన ఒక ఘటన ఇపుడు హాట్ టాపిక్ గా మారింది.

తన తల్లి కారణంగా వివాదాలలో చిక్కుకొని పోలీస్ స్టేషన్ కి కూడా వెళ్లిన సంగీత…

గతంలో సంగీత ఒక వివాదం లో చిక్కుకొని పోలీస్ స్టేషన్ కు వెళ్లాల్సి వచ్చింది. దీనికి కారణం తన తల్లి అవ్వడం విశేషం. కారణం ఏంటంటే.. సంగీత త‌న త‌ల్లి ఒకే ఇంటిలో ఉంటున్నారు. ఒకే ఇంట్లో సంగీత త‌న భ‌ర్త‌తో పై అంత‌స్థులో నివాసం ఉంటే.. పెద్ద కుమారుడితో క‌లిసి ఆమె తల్లి కింద అంత‌స్థులో ఉంటున్నారు. ఇది ఇలా ఉండగా సంగీత ఇల్లు కాళీ చేసి వెళ్లిపోవాల‌ని వేధిస్తోందని తన తల్లి మ‌హిళా క‌మిష‌న్ కు ఫిర్యాదు చేయడంతో అప్పట్లో ఈ వార్త టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయ్యింది.

అయితే ఈ విషయంపై సంగీత అభిమానులకు ట్విట్టర్ ద్వారా వివరణ కూడా ఇచ్చింది. చిన్నపటి నుండి తనను తన తల్లి డబ్బులు సంపాదించే వస్తువుని చుసినట్టుగా చూసేదని, సోదరులు ఇద్దరూ ఏం పని చేయకపోగా మత్తుకు బానిసలుగా మారినా తాను వారినే సమర్టించేదని చెప్పుకొచ్చింది. నేను భర్తతో కలసి సంతోషంగా ఉండటం ఓర్చుకోలేక ఇలా తప్పుడు కేసులు పెట్టి పరువుతీస్తోందని వివరణ ఇచ్చింది. అంతేగాక ఒక తల్లి ఎలా ఉండకూడదో తనని చూసి నేర్చుకున్నాను అని ఆవేదన వ్యక్తం చేసింది. అప్పట్లో సంగీత ఫ్యామిలీ లోని ఈ వివాదం, సంగీత చేసిన కామెంట్స్ సంచలనం రేపింది.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago