Rashmi -Anasuya: జబర్దస్త్ యాంకర్లుగా రష్మీ అనసూయ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.అయితే వీరిద్దరూ యాంకర్లుగా మంచి గుర్తింపు సంపాదించుకున్నప్పటికీ వీరిద్దరి వ్యక్తిత్వం చాలా భిన్నంగా ఉంటుంది.రష్మీ నిత్యం మూగజీవాల గురించి రోడ్లపై వాటిని ఎవరైనా హింసిస్తే పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వాటి గురించి స్పందిస్తూ వాటిని హింసించిన వారికి శిక్షపడేలా చేస్తూ మూగజీవాలపై తన ప్రేమను చాటుకుంటారు.
ఇక అనసూయ సైతం తనకు సంబంధించిన విషయాలను షేర్ చేస్తూ తన గురించి ఎవరైనా ట్రోలింగ్ చేస్తే వారికి తనదైన శైలిలో సమాధానం చెబుతూ ఉంటారు.ప్రస్తుతం అనసూయకు విజయ్ దేవరకొండ అభిమానులకు మధ్య పెద్ద ఎత్తున ట్వీట్ వార్ జరుగుతుంది. ఈ క్రమంలోనే కొందరు నెటిజెన్లు ఈ గొడవ మధ్యలోకి రశ్మిని లాగారు.
ఈ సందర్భంగా ఒక నెటిజన్ రష్మికి ట్వీట్ చేస్తూ అందులో.. ఎవరేమన్నా పట్టించుకోవు నీతో అసలు గొడవే ఉండదు… అసలు ఎవరికీ రిప్లై ఇవ్వవు నీకు తెలుగు అర్థం కాదు అంటూ ఒక నెటిజన్ రశ్మిని ఉద్దేశిస్తూ ఆమె నవ్వుతూ ఉన్నటువంటి ఒక ఫోటోని షేర్ చేస్తూ మరి ఈ ట్వీట్ చేశారు. ఇక ఈ ట్వీట్ పై రష్మీ ఎంతో భిన్నంగా స్పందించింది.
ఈ విధంగా నేటిజన్ చేసిన ట్వీట్ కు ఈమె రిప్లై ఇస్తూ… పండగ చేసుకో అంటూ కామెంట్ చేసింది.అందరికీ రష్మీలో నచ్చే విషయం ఇదే తను ఏం చెప్పాలనుకున్న సింపుల్ గా క్లియర్ గా చెప్పేస్తుంది. అనసూయతో పోలిస్తే రష్మీ ఎంతో క్లాస్ అంటూ పెద్ద ఎత్తున నేటిజన్లు రష్మి పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక అనసూయ జబర్దస్త్ నుంచి తప్పుకోవడంతో ఆ కార్యక్రమానికి కూడా రష్మీ యాంకర్ గా వ్యవహరిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…