Featured

Dasari Vignan : కెసిఆర్ టైగర్ అంటూ బండ్ల గణేష్ ట్వీట్… ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను రెచ్చగొట్టడానికేనా : దాసరి విజ్ఞాన్

Dasari Vignan : ‘బ్రహ్మాస్త్ర’ సినిమా సౌత్ లో కూడా విడుదల చేయాలని కరణ్ జోహార్ భావించడంతో సినిమా ప్రమోషన్స్ కోసం సౌత్ చుట్టేశారు. ఇక రాజమౌళి ఈ సినిమాకు సౌత్ లో సమర్పకుడిగా వ్యవహారిస్తున్నారు. సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా చేయాలని హైదరాబాద్ లో ప్లాన్ చేసారు జక్కన్న. ఇక ఎన్టీఆర్ ను ఈ ఈవెంట్ కి ముఖ్య అతిధి గా పిలిచి సినిమాకు మంచి హైప్ తీసుకురావాలని అనుకున్నారు. అయితే తెలంగాణ ప్రభుత్వం ఈవెంట్ కి అనుమతిని మొదట ఇచ్చినా చివర్లో రద్దు చేసింది. వినాయక చవితి ఉత్సవాల కారణంగా బందోబస్తులో పోలీసులు ఉండడం వల్ల ఈవెంట్ కి ఎక్కువ మంది పోలీసులను పంపలేమని అందుకే ఈవెంట్ రద్దు చేసుకోమని చెప్పారు. ఇక ఈ ఇష్యూ లో కొత్త కోణాలు ఆవిష్కరిస్తున్నారు కొంతమంది.

బండ్ల ట్వీట్ తో మరోసారి వివాదం…

ఎన్టీఆర్ తో అమిత్ షా భేటీ వల్లే బ్రహ్మాస్త్ర సినిమా ఈవెంట్ కు అనుమతి రద్దు చేసింది తెలంగాణ ప్రభుత్వం అంటూ విశ్లేషణలు మొదలయ్యాయి. బీజేపీ మీద పరోక్షంగా విరుచుకుపడ్డాడు కెసిఆర్ అంటూ మాట్లాడుతున్నారు. ఇక ఈ విశ్లేషణలు ఒక వైపు ఉంటే మరో వైపు అగ్గికి ఆజ్యం పోసినట్లు కెసిఆర్ టైగర్ అంటూ బండ్ల గణేష్ ట్వీట్ చేసాడు. సాధారణంగా ఎన్టీఆర్ ను ఫ్యాన్స్ యంగ్ టైగర్ అని పిలుచుకుంటారు. ఇక అలాంటిది బండ్లన్న కెసిఆర్ ను టైగర్ అన్నాడంటే కావాలనే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను రెచ్చగొడుతున్నట్లు తెలుస్తోంది. ఇక దీనిపై సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ మాట్లాడుతూ అసలు బండ్ల గణేష్ ని ఎవరూ పట్టించుకోవడం లేదు. ఒక నిర్మాతగా మరో సినిమా ఈవెంట్ రద్దు అయితే ఎవరైనా ఇలా ప్రవర్తిస్తారా, ఆయన చాలా ప్లాన్ గా నిర్మాత అయ్యాడు.

మెగా హీరోలు కాకుండా మిగిలిన ఎవరి సినిమాలైనా ప్లాప్ అవ్వాలని భావిస్తాడు. అందుకే ఎన్టీఆర్ తో బాద్ షా, టెంపర్ సినిమాలకు కూడా బాగా లేట్ చేసి సినిమాలను ప్లాప్ దిశగా తీసుకెళ్లాడు. ఒక హీరో మెగా హీరోలకు పోటీ వస్తాడు అనుకుంటే వారితో సినిమాలు చేసి ప్లాప్స్ చేస్తాడు. ఎక్కువ డేట్స్ తీసుకుని వాళ్ళ షెడ్యూల్స్ ని లేట్ చేస్తాడు, గ్యాప్ వచ్చేలా చేస్తాడు ఇతని గురించి ఇండస్ట్రీ పట్టించుకోవడం మానేసింది అంటూ మాట్లాడాడు విజ్ఞాన్. ఇక ఇపుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను రెచ్చగొడుతున్నాడు. బ్రహ్మాస్త్ర సినిమా విషయంలో మెగా ఫ్యాన్స్ ను డివైడ్ చేయాలని చూస్తున్నాడు అంటూ అభిప్రాయపడ్డారు దాసరి విజ్ఞాన్.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago