Dasari Vignan & Damu Balaji : తారకరత్న వల్లే విజయసాయి రెడ్డి ఆ పదవి నుండి డిస్ మిస్…: దాసరి విజ్ఞాన్ & దాము బాలాజీ

Dasari Vignan & Damu Balaji : నందమూరి తారకరత్న కు బెంగళూరు నారాయణ హృదయాలయలో చికిత్స అందించినప్పటి నుండి విజయసాయి రెడ్డి గారు బాలకృష్ణ తో టచ్ లో ఉంటూ పరిస్థితి అడిగి తెలుసుకుంటూ ఉన్నారు. ఇక దురదృష్టవశశాత్తు తారకరత్న మరణించాక అన్ని కార్యక్రమాలలోనూ నందమూరి కుటుంబ సభ్యులతో ఉంటూ విజయసాయి రెడ్డి అలేఖ్య కు తన పిల్లలకు భరోసా ఇవ్వడంలో కృషి చేసారు. రాజకీయాల్లో ఉప్పు నిప్పులా ఉండే విజయసాయి రెడ్డి, చంద్రబాబు నాయుడు ఇద్దరూ కలిసి మాట్లాడటం బాగా వైరల్ అయింది. అయితే రాజకీయంగా చంద్రబాబును బాగా విమర్శించిన విజయసాయి రెడ్డి అలేఖ్య కోసం అలేఖ్య పిల్లలు కోసం ఆలోచించారు. అయితే ఇలా నందమూరి ఫ్యామిలీతో చనువుగా ఉండటమే ఇప్పుడు ఆయన కొంప ముంచిందా అనే వాదనలు వినిపిస్తున్నాయి. జగన్ కి విజయసాయి మీద కోపం తెప్పించింది అనే కథనాలు వెలువడుతున్నాయి.

ఆ పదవి నుండి విజయసాయిని తొలగించిన జగన్…

జగన్ కు ముందునుండి విజయసాయి రెడ్డి ఒక తండ్రి లాగా వెన్నంటి ఉంటూ వచ్చారు. జగన్ వద్ద ఉండే అత్యంత కీలక వ్యక్తుల్లో ఆయన ఒకరు. అలాంటి వ్యక్తిని పదవుల నుండి తొలగించడం ఆశ్చర్యానికి గురిచేసింది అంటూ అనలిస్ట్ విజ్ఞాన్ మరియు బాలాజీ అభిప్రాయపడ్డారు. నిజానికి విజయసాయి రెడ్డి వైసీపీ లోని కొన్ని సంఘాలకు ప్రెసిడెంట్ గా వ్యవహరిస్తున్నారు. వాటిలో కొన్నింటికి ప్రస్తుతం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ప్రెసిడెంట్ ను చేస్తూ జగన్ ఉత్తర్వులు జారీ చేసారు. కొంత కాలంగా విజయసాయి మీద జగన్ గుర్రుగా ఉన్నట్లు వినిపిస్తోంది. గ్యాప్ మైంటైన్ చేస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అదీ కాక విజయసాయి కూడా టీడీపీ మీద ట్వీట్ వార్ చేయడం లేదు ఇవన్నీ జగన్ విజయసాయి మధ్య దూరం పెరిగిందనడానికి కారణాలుగా చూపుతున్నారంటూ చెప్పారు.

ఇక దాము బాలాజీ చెబుతూ నిజానికి జగన్ కు ఈ విషయాల మీద కన్నా లిక్కర్ స్కాం విషయంలో విజయ సాయి సరిగా డీల్ చేయలేదనే కోపం ఉంది అంటూ చెప్పారు. లిక్కర్ స్కాంలో విచారణలో ప్రముఖంగా వినిపిస్తున్న పేర్లు విజయసాయి రెడ్డి అల్లుడు పేరు అలాగే వైసీపీ లీడర్ మాగుంట శ్రీనివాస రెడ్డి కుటుంబం సభ్యుల పేర్లు, కెసిఆర్ కూతురు కవిత పేరు. అందుకే ఈ విషయంలో సరిగా మొదటి డీల్ చేసుంటే పార్టీ కి చెడ్డ పేరు వచ్చిండేది కాదు అని జగన్ భావించారట. ఇక విజయసాయి రెడ్డి బీజేపీ కి సన్నిహితంగా స్వత్రంత్రంగా వ్యవహరిస్తున్నారనే అనుమానంతో జగన్ దూరం పెట్టారని అభిప్రాయపడ్డారు.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

3 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago