Prasanna Kumar : నందమూరి తారకరామారావు గారు అనగానే అటు సినిమాలలోనూ ఇటు పాలిటిక్స్ లోనూ తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ఆయన కుటుంబం కూడా చాలా పెద్దది. ఆయన హీరోగా ఎంతో సంపాదించి ఆయన పిల్లలకు కోట్ల ఆస్తులు ఇచ్చారు. కానీ రాజకీయాల్లోకి వచ్చిన తరువాత మాత్రం వారి కుటుంబ సభ్యులను అధికార దూర్వినియోగం చేయనివ్వలేదు. ఎపుడూ ఒక సీఎం కొడుకులుగా నందమూరి వారసులు వ్యవహరించలేదంటూ నందమూరి ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడైన ప్రసన్న కుమార్ గారు వివరించారు.
ఆస్తులు ఎలా పోయాయాంటే…
ఎన్టీఆర్ గారు సీఎం హోదాలో ఉన్నా తన పిల్లలను మాత్రం సీఎం పిల్లలుగా చూసేవారు కాదని, ఆయన పిల్లలు కూడా సీఎం కొడుకులుగా ఎపుడు డూ ప్రవర్తించలేదని చెప్పారు. ఇక సీఎం తండ్రి ఉన్నా వాళ్ళ సొంత ఖర్చులతోనే ఏదైనా సేవా కార్యక్రమాలు లాంటివి చేసేవారు. ఒకసారి బాలకృష్ణ పత్రికలో చూసి ఒక మదనపల్లి చిన్నారికి హార్ట్ ఆపరేషన్ అవసరం అని తెలిసీ పత్రిక వాళ్లకు ఫోన్ చేసి ఆ పాప వాళ్ళ నెంబర్ తీసుకుని చెన్నై పిలిపించి అక్కడే విజయ హాస్పిటల్ లో వైద్యం చేయించారు.
అప్పటికి బాలకృష్ణ గారి తండ్రి ఏపీ సీఎం అలాగే బావ దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు ఆరోగ్య శాఖా మంత్రి గా ఉన్నారు. వారికి చెప్పుంటే రూపాయి ఖర్చులేకుండా పని జరిగేది కానీ బాలకృష్ణ అలా చేయలేదు, నేను చేయగలను కదా మా నాన్నను అడగను అని అనేవారు. అలా ఎన్నో సేవా కార్యక్రమాలను నందమూరి ఫ్యామిలీ చేసింది కానీ పబ్లిసిటీ చేసుకోలేదు. వాళ్ళు అనుకుని ఉంటే తండ్రి సీఎం కావడం వల్ల ఎన్నో ఆస్తులు చేసుకుని ఉండవచ్చు కానీ అలా చేయలేదు. వాళ్ళ ఆస్తులు పోగొట్టుకున్నారే కానీ సంపాదించుకోలేదు అంటూ చెప్పారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…