దివంగత దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన సినిమాలలో ఏదో ఒక విభిన్నమైన కథాంశం ఉంటుంది. అతడి దర్శకత్వంలోనే ఎంతో మంది హీరోలు, హీరోయిన్లు, నటీనటులు ఎంతో మంది సినీ పరిశ్రమకు పరిచయం అయ్యారు. అతడు ఒక సినీ శిఖరం. ప్రతీ ఒక్కరు దాసరి నారాయణరావును గురువుగా పేర్కొంటారు. అంతలా తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు.
దాసరి నారాయణరావు పశ్చిమగోదావరి జిల్లాలోని పాలకొల్లులో అతి సామాన్య మధ్యతరగతి రైతు కుటుంబంలో పుట్టారు. సినిమాలపై ఎంతో ఆసక్తితో మద్రాసు చేరుకొని అక్కడే అంచెలంచెలుగా ఎదిగారు. అయితే అతడు ఇంతలా సినీ రంగంలో పేరు తెచ్చుకోవడానికి గల కారణం అక్కినేని నాగేశ్వరావు మరియు సావిత్రి గారు అని అతడు ఎన్నో సందర్బాల్లో చెప్పుకొచ్చారు కూడా.
అంతలా ఏఎన్నార్ ను ఆదిరించిన దాసరి అతడితోనే విభేదాలు వచ్చాయట. రెమ్యూనరేషన్ విషయంలో విభేదాలు కాస్త తారా స్థాయికి చేరుకొని.. ఇద్దరు ఒకరంటే ఒకరు.. మాట్లాడుకోకుండా ఉండేవారట. ఇదంతా దాసరి నారాయణరావు ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఆ విషయంలో ఇలా మేము దూరం అవుతామని ఎన్నడూ అనుకోలేదని అన్నారు.
ఏఎన్నార్ తో సమానంగా దాసరికి కూడా రెమ్యూనరేషన్ ఇస్తుండటంతో నాగేశ్వరావు అన్నఒక మాటకు అతడు బాగా బాధపడ్డట్లు చెప్పుకొచ్చాడు. అయితే తర్వాత వాళ్ల కుటుంబంతో దాసరి కుటుంబానికి ఎలాంటి మనస్సర్థలు రాలేదన్నారు. తర్వాత దాసరి నారాయణ రావు అక్కినేని నాగార్జునతో ఎన్నో సినిమాలను తెరకెక్కించిన విషయం తెలిసిందే.
చాలామంది ఇళ్లలో ఒకే సీన్ కనిపిస్తుంది. రాత్రి మిగిలిన అన్నాన్ని ఉదయాన్నే చెత్తబుట్టలో పడేయడం. “పాత అన్నం తింటే కడుపు…
దక్షిణాది సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ Regina Cassandra తాజాగా బాలీవుడ్ అనుభవాలపై సంచలన వ్యాఖ్యలు…
2026 టీ20 వరల్డ్ కప్ ఉత్కంఠభరిత దశలోకి అడుగుపెట్టింది. లీగ్ పోరాటాలు దాదాపు ముగియడంతో ఇప్పుడు అందరి చూపు సూపర్-8…
అంతరిక్ష రంగంలో కెరీర్ కలలు కనే విద్యార్థులకు ఇది మంచి అవకాశం. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థకు చెందిన విక్రమ్…
తిరుపతి నగరానికి కొద్ది దూరంలో, రేణిగుంట మండలంలోని గుడిమల్లం గ్రామంలో ఒక అపూర్వ చారిత్రక కట్టడం భక్తులను, చరిత్రాభిమానులను సమానంగా…
తమిళనాడు రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.…