Featured

Deepika Padukone : షూటింగులో గుండె వేగం పెరిగి అస్వస్థతకు గురైన దీపికా పడుకొనే.. వెంటనే హాస్పిటల్ కి తరలింపు.. కోలుకున్నాక షూటింగులో పాల్గొన్న దీపిక..!

Deepika Padukone : బాలీవుడ్ టాప్ హీరోయిన్ గా వెలుగుతున్న దీపికా పడుకొనే పలు సినిమాలతో బిజీగా ఉంది. ప్రస్తుతం ప్రభాస్ తో కలిసి ప్రాజెక్ట్ కే లో నటిస్తోంది. డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వస్తోన్న ఈసినిమాలో అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుని ప్రస్తుతం హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుగుతోంది. ఈ షూటింగ్ షెడ్యూల్ లో అమితాబ్ బచ్చన్, దీపికా పాల్గొన్నారు.

గుండె వేగం పెరగడంతో ఆసుపత్రికి తరలింపు…..

ఇక షూటింగులో దీపికకు సడన్ గా గుండె వేగం పెరిగి అస్వస్థతకు లోనవడంతో హుటాహుటిన కామినేని హాస్పిటల్ కు తరలించారు. అయితే కంగారు పడవల్సిన పని లేదని దీపికా సాధారణ చెక్ అప్ కోసం మాత్రమే హాస్పిటల్ కి వెళ్లినట్లు దీపిక పిఆర్పి టీం ప్రకటించారు. ప్రస్తుతం దీపిక బాగుందని వదంతులు నమ్మవద్దని చెప్పారు. ఇక దీపికా హాస్పిటల్ లో ట్రీట్‌మెంట్ పూర్తయ్యాక నేరుగా షూటింగ్ కి వెళ్లి అమితాబ్ బచ్చన్ తో చేయాల్సిన సన్నివేశాల చిత్రీకరణలో పాల్గొన్నారు. ప్రభాస్ నటిస్తున్న ప్రాజెక్టు కే సినిమా అమితాబ్ బచ్చన్ చేతుల మీదుగా గురుపూర్ణిమ నాడు మొదలుపెట్టారు.

ప్రభాస్ ఆ సందర్బంగా ఇండియా కి గురు అయిన అమితాబ్ చేతుల మీదుగా ఈ ప్రాజెక్ట్ మొదలవడం ఆనందంగా ఉందని ప్రకటించారు. ఇక ఈ సినిమాలో దీపికా పాత్ర కూడా ఇంతవరకు చేయనటువంటి పాత్ర అని నాగ్ అశ్విన్ తెలిపారు. ఇక దీపికా ఈ సినిమా కాకుండా రన్ బీర్, ఆలియా భట్ ల బ్రాహ్మస్త్ర సినిమాలో స్పెషల్ రోల్ చేస్తోంది. ఇక అమితాబ్ తో మరో సినిమా, షారుఖ్ ఖాన్ హీరోగా పథన్, హృతిక్ రోషన్ హీరోగా ఫైటర్ సినిమాల్లో నటిస్తోంది. ఇక భర్త రన్వీర్ సింగ్ సినిమా సర్కస్ లో గెస్ట్ రోల్ చేస్తోంది.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago