Devara Movie: టాలీవుడ్ యంగ్ హీరో గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న దేవర సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నారు.ఇలా ఈ సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈయన ఎలాగైనా ఈ సినిమాతో మంచి సక్సెస్ అందుకోవాలని కసితో ఉన్నట్టు తెలుస్తుంది.
త్రిబుల్ ఆర్ తో మంచి హిట్ కొట్టిన ఎన్టీఆర్ ఈ సినిమాతో కూడా అదే స్థాయిలో హిట్ అందుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక కొరటాల శివ తన ముందు చిత్రం ఆచార్య ఈ సినిమా భారీ డిజాస్టర్ అయిన సంగతి మనకు తెలిసిందే.ఇలా డిజాస్టర్ డైరెక్టర్ తో ఓ పాన్ ఇండియా హీరో సినిమా చేయడం అంటే మామూలు విషయం కాదు. అందుకే ఈ సినిమా విషయంలో ఎన్టీఆర్ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఈ సినిమాతో కొరటాలపై ఉన్న డిజాస్టర్ మార్క్ తొలగించాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్నారట.
ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకున్నటువంటి ఎన్టీఆర్ స్క్రిప్ట్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ సమయంలో కూడా ప్రతి షాట్ ఎన్టీఆర్ చూసి దానిని ఫైనలైజ్ చేయాల్సిందేనట. అలా అని ఎన్టీఆర్ నిర్ణయం ప్రకారమే ఈ సినిమా షూటింగ్ జరుగుతుందని తెలుస్తుంది.
ఈ సినిమాకు దర్శకుడు కొరటాల శివ అయినప్పటికీ డైరెక్షన్ మొత్తం ఎన్టీఆర్ దేననీ, ఈ సినిమా విషయంలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా ఉండటం కోసమే ఎన్టీఆర్ ఇలా చేస్తున్నారని తెలుస్తుంది.ఇక ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఈ సినిమాలో విలన్ పాత్రలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ నటించిన బోతున్నారు. హీరోయిన్ గా నటి జాన్వి కపూర్ తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…