Devi Vs Vishwak Sen : టీవీ9 యాంకర్ దేవి నాగవల్లి హీరో విశ్వక్ సేన్ ల మధ్య వివాదం రోజు రోజుకీ ముదురుతోంది. సోషియల్ మీడియాలో ఈ వివాదంపై రోజు ఎవరో ఒకరు స్పందించడం తో ఈ వివాదం ఇంకా హాట్ టాపిక్ గా మారుతోంది. ప్రస్తుతం వివాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సోషల్ మీడియా నుంచి ఈ వీడియో సామాన్య జనాల వరకు చేరింది. అయితే ప్రస్తుతం దేవీ నాగవల్లి విశ్వక్ సేన్ ఇద్దరిలో ముందుగా ఓపిక కోల్పోయింది ఎవరు ముందుగా దూషించింది ఎవరు అని అందరూ ప్రశ్నించుకుంటున్నారు.
ప్రస్తుతం ఈ వివాదానికి సంబంధించి బాబు గోగినేని పెట్టిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ట్వీట్ సారాంశం ఏంటంటే..విశ్వక్ – దేవిల ఇద్దరిలో మెంటల్ హెల్త్ యాక్ట్ ప్రకారం.. చట్టాన్ని ఎవరు మొదట ఉల్లంఘించారు అనే అంశం మీద బాబు గోగినేని ట్వీట్ చేశారు. అయితే ఒక వ్యక్తి మానసిక స్థితి గురించి మనం జడ్జ్ చేయొచ్చా లేదా అని ఆలోచించకుండా మొదటి ఎవరు పర్సనల్ ఎటాక్ చేశారని సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి.
ఎవరు మొదట చట్టాన్ని ఉల్లంఘించారు…….
ప్రస్తుతం మానసిక స్థితి గురించి పర్సనల్ ఎటాక్ గురించి సోషల్ మీడియాలో దుమారం రేగుతోంది. ఈ విషయం పరంగా మెంటల్ హెల్త్ యాక్ట్ పై హైకోర్టు న్యాయవాది శ్రీ ప్రమోద్‌రెడ్డి మాట్లాడుతూ.. లైవ్ టీవీలో డిబేట్ కు ఆహ్వానించి నటుడిని మొదట నిస్పృహ లేదా మానసిక స్థితి సరిగా లేదని ఆరోపించడం తప్పు .. ఈ విషయంలో టి వి 9 యాంకర్ దేవి నాగవల్లి మొదట చట్టాన్ని ఉల్లంఘించినట్లు కనిపిస్తుంది. ఒక వ్యక్తి యొక్క మానసిక ఆరోగ్య స్థితిని గురించి మాట్లాడే హక్కు ఎవరికీ లేదని అలా మాట్లాడటం అనేది అతని గౌరవానికి సంబంధించిందని తెలిపారు. ఒకవేళ నిజంగానే విశ్వక్ సేన్ మానసికంగా ఆరోగ్యాంగా లేకపోతే అతడిని చర్చకు పిలవడం ఉద్దేశపూర్వక నేరానికి నిదర్శనం” అంటూ చెప్పుకొచ్చారు.“మానసిక ఆరోగ్య చట్టాన్ని ఉల్లంఘించడం శిక్షార్హమైన నేరం అని, ఇలా చేస్తే రెండు సంవత్సరాల వరకు జైలు శిక్ష కూడా ఉండొచ్చు .” అన్నారు. నెటిజన్లు కూడా ఈ విషయంలో దేవి నాగవల్లి దే తప్పు అని కామెంట్ చేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…