Featured

Surprise gift for Priya Mani : ప్రియమణికి సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన ఢీ డాన్స్ షో..!

Surprise gift for Priya Mani : ప్రస్తుతం బుల్లితెర మీద ప్రసారమౌతున్న టీవీ ప్రోగ్రాంలో ఢీ డాన్స్ ప్రోగ్రామ్ కూడా ఒకటి. ఈ టీవీ ఛానల్ లో ప్రసారం అవుతున్న ఈ ప్రోగ్రాం టాప్ రేటెడ్ ప్రోగ్రాం లలో ఒకటిగా దూసుకుపోతోంది. ఈ ప్రోగ్రాం ద్వారా ఇప్పటి వరకు చాలా మంది డాన్సర్లు పరిచయమయ్యారు. ప్రస్తుతం ఈ ప్రోగ్రాం కి జడ్జిగా ప్రియమణి వ్యవహరిస్తున్నారు. సౌత్ సినిమాలలో మనకు హీరోయిన్ గానే కాకుండా డీ డాన్స్ ప్రోగ్రాం లో మంచి న్యాయ నిర్ణేత గా కూడా పేరు సంపాదించుకున్నారు. ఈ ప్రోగ్రాం ద్వారా ప్రియమణి ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యింది. ప్రియమణి ఈ ప్రోగ్రాం లో న్యాయనిర్ణేతగా వ్యవహరించబట్టి ఐదేళ్ళు పూర్తి అయింది. ఐదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని ఢీ డాన్స్ షో ఒక ఊహించని బహుమతిని ఆమెకు అందించింది. ఈ బాహుబలి ని చూసి ప్రియమణి భావోద్వేగానికి గురై కన్నీరు పెట్టుకుంది. ప్రస్తుతం ఈ వీడియో బాగా వైరల్ అవుతోంది.

ఢీ డాన్స్ షో ఇచ్చిన సర్ ప్రైజ్ ని చూసి ప్రియమణి కన్నీటిపర్యంతం…..

న్యాయనిర్ణేతగా ఐదేళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రియమణి లైఫ్ స్టోరీ నీ స్టేజి మీద సాయి – నైనిక అందంగా ప్రెజెంట్ చేశారు. సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వక ముందు నుంచి ఆమె వివాహం వరకు ఒక అందమైన స్టోరీని కళ్లకు కట్టినట్టు చూపించారు. ఆమె సినిమాల్లోకి రాక ముందు పడిన కష్టాలు, సినిమా రంగానికి పరిచయం అవ్వడం, స్టార్ హీరోయిన్ గా ఎదగడం మొదలు కొని తన జీవితంలోని ప్రేమ గురించి తన వివాహం గురించి చాలా అద్భుతంగా చూపించారు. అయితే మొత్తం పర్ఫామెన్స్ ప్రియమణి ప్రేమ వివాహం గురించి చూపించిన సన్నివేశాలు హైలెట్ గా నిలిచాయి. ఈ పర్ఫామెన్స్ చూసి నా ప్రియమణి తన గత జీవితాన్ని తన భర్తను గుర్తు చేసుకొని ఎమోషనల్ అయ్యారు.

డాన్స్ పర్ఫార్మెన్స్ ఏ కాకుండా ప్రియమణి కి కొరియోగ్రాఫర్ సాయి ఇంకొక సర్ ప్రైజ్ ని కూడా ఇచ్చారు.
ప్రియమణికి వాళ్ళ అమ్మమ్మ గారు అంటే ఎంత ఇష్టమో ఇదివరకు చాలా సార్లు చెప్పారు. తను సినిమాల్లోకి రావడానికి కారణం తనే అని అతను ఇప్పుడు ఇంకా పొజిషన్లో ఉండడానికి కారణం కూడా వాళ్ళ అమ్మగారు అని చాలాసార్లు చెప్పుకొచ్చారు. అయితే కొరియోగ్రాఫర్ సాయి ప్రియమణి కి వాళ్ళ అమ్మమ్మ గారి తో ఉన్న ఒక పెయింటింగ్ బహుమతిగా ఇచ్చారు. ప్రియమణి తనకి ఎంతో ఇష్టమైన అమ్మమ్మ గారి తో ఉన్న పెయింటింగ్ చూసి భావోద్వేగానికి గురై కన్నీళ్లు ఆపుకోలేకపోయింది.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago