Featured

Devi Nagavalli insta video viral : వివాదం తరువాత దేవి తొలిసారి వీడియో పోస్ట్ చేసి.. ఎమోషనల్ అవుతున్న నెటిజన్స్..!

Devi Nagavalli insta video viral : గత రెండు రోజులుగా దేవి నాగవల్లి, విశ్వక్ సేన్ మధ్య జరిగినా వివాదం ఇంకా చల్లారలేదు. ఎవరో ఒకరు వారికి మద్దతు ఇస్తూ మళ్ళీ ఆ విషయాన్ని వైరల్ చేస్తున్నారు. ఇక ఇరువురి తప్పు ఉన్నా కేవలం విశ్వక్ నే తప్పుబట్టడంతో నెటిజన్స్ దేవి పైన, టీవీ 9 పైన బాగా నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఒక జర్నలిస్ట్ గా దేవి సహనాన్ని కోల్పోకూడదు. స్టూడియోకి వచ్చిన గెస్ట్ ను వ్యక్తిగతంగా మాట్లాడకూడదు. ఈ విషయాన్నీ మరచిపోయి దేవి విశ్వక్ ను పాగల్, డిప్రెస్డ్ పర్సన్ అనడం, ఇక ఆపై గెట్ అవుట్ అంటూ విరుచుకు పడటంతో సంయమనం కోల్పోయిన విశ్వక్ కూడా ఒక మహిళను అనకూడని మాట అన్నాడు.ఈ ఇష్యూలో దేవిది ఎంత తప్పు ఉందొ విశ్వక్ ది కూడా అంతే తప్పు ఉంది. అయితే విశ్వక్ మళ్ళీ తాను మాట్లాడినదానికి క్షమాపణలు చెప్పాడు ఇక్కడే దేవి మళ్ళీ పొరపాటు చేసింది. వెంటనే విశ్వక్ పై మంత్రి తలసాని కి ఫిర్యాదు చేయడం, లాంటివి చేసింది.

ఇద్దరి తప్పు ఉన్నా ఈ వివాదంలో దేవి తీరునే ఎక్కువగా నెటిజన్లు తప్పుబట్టారు. ఇక ప్రముఖ బీబీసీ ఛానల్ వారు దేవితో మాట్లాడటానికి ప్రయత్నించిన తనకు సమయం కావాలని కోరినట్లు తెలుస్తోంది అయితే విశ్వక్ మాత్రం తన సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఈ విషయం గురించి మాట్లాడి తాను తప్పు చేయలేదంటూ ఎమోషనల్ అయ్యి ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు.

సమాజం కోసం ఆలోచించే దేవినే అసలైన దేవి…..

అయితే తాజాగా దేవి ఈ వివాదం తరువాత తొలిసారి ఒక వీడియోను తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఇక ఆ వీడియోలో ఏదో గుడి మెట్ల మీద ఓ వృద్ధురాలు కూర్చుని, గుడి లోపలకి వెళ్లే వారిని బయటకు వచ్చేవారిని దానం చేయమని కోరుతుంది. కానీ ఎవరు ఆమెను పట్టించుకోరు. పైగా ఇదే సమయంలో ఆలయంలోకి వెళ్లే మెట్లు ఎక్కేముందు వాటి మీద కొన్ని బియ్యం పోసి దండం పెట్టుకుని పైకి ఎక్కుతున్నారు. ఈ ఆలయానికి వచ్చిపోయే వారు ఆ బియ్యం గింజల మీద నడుచుకుంటూ వెళ్తున్నారు.

మనసులను మెలిపెట్టే ఈ దృశ్యాన్ని చూసి చలించిన దేవి నాగవల్లి ఆ బియ్యాన్ని అలా కింద పోసే బదులు ఆమె దోసిలిలో పోస్తే వాటికి సార్థకత లభించేది అనే వాఖ్యలతో తన ఇంస్టాగ్రామ్ లో షేర్‌ చేసింది. ఇక ఈ వీడియో ఎపుడు బాగా వైరల్ అవుతూ నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. అసలైన దేవి ఇలా ఉంటుంది సమాజ హితన్ని కాంక్షిస్తూ తన వంతు ఏదైనా చేయాలనుకుంటుంది అంటూ నెటిజన్స్ ఎమోషనల్ కురిపిస్తున్నారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago