Featured

Ram Gopal Varma comments on KGF2 director : ప్రశాంత్ నీల్ ను వీరప్పన్ తో పోల్చిన ఆర్జీవి… సినిమాకు కొత్త పోకడ నేర్పించావంటూ ప్రశంస…!

Ram Gopal Varma comments on KGF2 director : రామ్ గోపాల్ వర్మ తన సోషల్ మీడియా పోస్టులతో ఎవరిని విమర్శిస్తాడో ఎవరిని పొగుడుతాడో తెలీదు. కానీ ఏమి చేసిన వైరల్ మాత్రం అవుతాడు. అలా ఉంటాయి మరి ఆర్జీవి మాటలు. వివాదాలతో రోజు సహవాసం చేసే ఆర్జీవి లేటెస్ట్ గా హిందీ జాతీయ భాషా వివాదంలో తన వంతు పాత్ర పోషించాడు. భాష కాదని హీరోలు తమ సినిమాలతో పోటీ పడాలంటూ ఛాలెంజ్ చేసారు. అటు సౌత్ హీరోలు, ఇటు నార్త్ హీరోలు తమ. సినిమా హిట్లతో పోటీపడాలని సూచించారు.

ఇక తాజాగా ఆర్జీవి కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ ను తన శైలిలో ప్రశంసించి వైరల్ అయ్యాడు. కేజీఎఫ్ ఫ్రాంచైస్ లో వచ్చిన కేజీఎఫ్ చాప్టర్ 1 సినిమా అంచనాలు లేకుండా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. అసలైన పాన్ ఇండియా సినిమాగా చరిత్ర సృష్టించింది. కన్నడ సినిమా పరిశ్రమ స్టామినాను మొత్తం దేశానికి చాటిచెప్పింది కేజీఎఫ్ చాప్టర్ 1.

ప్రశాంత్ ను వీరప్పన్ తో పోల్చిన ఆర్జీవి….

ఇక ఆ తరువాత విడుదలైన కేజీఎఫ్ చాప్టర్ 2 సినిమా ఎన్ని సంచలనాలు సృష్టించిందో అందరికి తెలిసిందే. ప్రశాంత్‌ నీల్‌ను ఇండియన్‌ సినిమా వీరప్పన్‌ అంటూ తన స్టైల్లో పొగిడారు. దర్శకుల దినోత్సవం సందర్భంగా ప్రశాంత్ నీల్‌కు శుభాకాంక్షలు తెలిపిన ఆర్జీవి, ‘కేజీఎఫ్2’ సినిమాతో కన్నడతో పాటు బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ దర్శకులకు కనువిప్పు కలిగించారని చెప్పారు. రీ షూటింగులు, రీ డ్రాఫ్టులు, పునరాలోచనలతో టన్నుల కొద్దీ డబ్బును వృథా చేస్తున్నారని, వాళ్లు వృధా చేస్తున్నంత డబ్బుతోనే మీరు క్వింటాల్ డబ్బు సంపాదించారని అన్నారు. సినీ పరిశ్రమలో సంప్రదాయబద్ధంగా ఉండే 95 శాతం మందికి ‘కేజీఎఫ్ 2’ నచ్చలేదని చెప్పారు. మీరు పాత ఇండస్ట్రీని బయటకు తోసేసి , కొత్త పరిశ్రమకు జీవం పోసావు, దాని పేరే ‘కేజీఎఫ్ 2’ అని ప్రశంసించారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago