Devoleena: ఈమధ్య కాలంలో సామాన్యుల నుంచి మొదలుకొని సెలబ్రిటీల వరకు వారికి సంబంధించిన ఏ చిన్న విషయమైనా సోషల్ మీడియా వేదికగా తమ అభిమానులతో స్నేహితులతో పంచుకుంటున్నారు. ముఖ్యంగా సెలబ్రిటీలు ఈ మధ్యకాలంలో పెద్ద ఎత్తున ప్రేమించిన వారిని పెళ్లి చేసుకొని కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్నారు. ఇక సెలబ్రిటీల పెళ్లి అంటే మామూలుగా ఉండదు.
తమ పెళ్లికి సంబంధించిన అప్డేట్ ను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకొని అభిమానులను సర్ప్రైజ్ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే బుల్లితెర నటిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న దేవలీనా భట్టాచార్జి ప్రేమించిన వ్యక్తిని డిసెంబర్ 14వ తేదీ వివాహమాడింది. అయితే ఈమె తన జిమ్ ట్రైనర్
షాన్వద్ షైఖ్ ని పెళ్లాడినట్లు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి క్లారిటీ ఇచ్చేసింది.
ఈమె ఈ విధంగా తన పెళ్లి గురించి సోషల్ మీడియా వేదికగా తెలియజేయడంతో దేవలీనా ఫ్యాన్స్ పెద్ద ఎత్తున ఈమెకు శుభాకాంక్షలు తెలియజేశారు.అయితే ఈమె పెళ్లికి ఎంతమంది అయితే శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రస్తుతం అందుకు రెట్టింపు మంది తనని పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు.ఇలాంటి ట్రోల్స్ చేయడానికి గల కారణం ఏంటి అనే విషయానికొస్తే ఈమె పెళ్లి జరుగుతున్న సమయంలో ఈమె పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అయిందని వార్తలు చక్కర్లు కొట్టాయి.
ఇలా పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అని తెలియడంతో పెద్ద ఎత్తున చాలామంది ఈమెను ట్రోల్ చేశారు. అయితే ఈ ట్రోల్స్ పై స్పందించిన దేవలీనా…నా గురించి వస్తున్నటువంటి ఈ వార్తలలో ఏ మాత్రం నిజం లేదని అయినా అలా ఎలా ఆలోచిస్తారు అంటూ ఈమె స్పందించారు. ఇలా తన గురించి వచ్చేటటువంటి ట్రోల్స్ గురించి తాను పెద్దగా పట్టించుకోనని కానీ ఈ విషయం తనని బాధ పెట్టిందని తెలిపారు. ఇలా తన గురించి వచ్చిన ట్రోల్స్ పై స్పందించి నటి క్లారిటీ ఇచ్చారు. ఇక ఈమె తెలుగులో కోడలా కోడలా కొడుకు పెళ్ళామా అనే సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులను సందడి చేశారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…