Featured

Murali Mohan : రాజశేఖర్ రెడ్డి చేసిన అవమానం మర్చిపోలేనిది…: మురళీ మోహన్

Murali Mohan : వ్యాపారం నుండి నటన మీద ఆసక్తితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మురళీ మోహన్ గారు ‘జగమే మాయ’ సినిమాతో పరిచయమై అనతి కాలంలోనే హీరోగా అనేక చిత్రాల్లో నటించారు. ఇండస్ట్రీలో హీరోగానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో నటించిన ఆయన అటు పాలిటిక్స్ లోకి వచ్చి అక్కడ తనదైన ముద్ర వేశారు. ఇక సినిమా నిర్మాణంలో అడుగుపెట్టి జయభేరి బ్యానర్ స్థాపించి పలు చిత్రాలను నిర్మించిన ఆయన ఈ మద్య కాలంలో సినిమాలను తగ్గించినా ఆయన పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ సినిమా రంగంలోని అనేక విషయాల గురించి అలాగే ఆయన రాజకీయాల గురించి మాట్లాడారు.

ఆరోజు నా గురించి వెటకారంగా మాట్లాడారు…

మా అసోసియేషన్ కు బిల్డింగ్ సీఎం పదవిలోకి వచ్చిన ఏ నాయకుడు ఆలోచించలేదంటూ చెప్పారు. హైదరాబాద్ కు సినిమా ఇండస్ట్రీ తరలి రావడానికి దాదాపు 10 ఏళ్ళ పైనే పట్టిందంటూ తెలిపారు. ఇక భూమి ఇస్తే మా బిల్డింగ్ కడదామని అనుకుంటే ఏ సీఎం ఇవ్వలేదు. అన్నపూర్ణ స్టూడియోస్ కి రామానాయుడు స్టూడియోస్ కి మధ్యలో కొంత భూమి ఏదైనా సినిమా ఇండస్ట్రీ అవసరాల కోసం వాడుకొమ్మని ప్రభుత్వం తెలిపినా శాంక్షన్ చేయలేదు. అటు ఇస్తామని చెప్పకుండా ఇవ్వనని చెప్పకుండా చాలా ఏళ్ళు చేయడం వల్ల మా బిల్డింగ్ నిర్మాణం జాప్యమైంది.

ఇక ఎన్టీఆర్ సీఎం అయినా, చంద్రబాబు సీఎం అయినా మా బిల్డింగ్ కి భూమి శాంక్షన్ చేయలేదు. రాజశేఖర్ రెడ్డి గారి దగ్గరికి సినిమా పెద్దలందరూ వెళ్ళినపుడు నేను రానని చెప్పినా తీసుకెళ్లారు. ఆయనకు నన్ను చూస్తే నచ్చదు టీడీపీ వాడినని అందుకే వద్దని చెప్పినా వినకుండా మా అసోసియేషన్ ప్రెసిడెంట్ లేకుండా ఎలా వెళ్తాము అని పిలుచుకుపోయారు. నాగేశ్వరావు గారు, చిరంజీవి, వెంకటేష్, నాగార్జున మొదలగు అందరూ అగ్ర హీరోలు వెళ్లగా రాజశేఖర్ రెడ్డి గారు మురళీ మోహన్ ఉన్నాడుగా ఇంకా ప్రభుత్వం భూమి ఇవ్వడం ఎందుకు తనని అడగండి అంటూ నవ్వాడు. ఇక ఇవ్వడని అక్కడున్న వాళ్లందరికీ అర్థమై దాదాపు ముప్పై మంది సినిమా వాళ్ళం వెళ్లగా ఫోటో తీసుకుందామని అడిగితే ఆయన నాకు టైం లేదని వెళ్ళిపోయాడు. అపుడు అందరం చాలా అవమానంగా ఫీల్ అయ్యాము అంటూ చెప్పారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago