Featured

Dhanush – Aishwarya Divorce: ధనుష్, ఐశ్వర్య.. విడాకులకు ఉదాహరణగా సమంత.. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నెటిజన్లు!

Dhanush – Aishwarya Divorce: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, ఐశ్వర్య వారి18 సంవత్సరాల వైవాహిక జీవితానికి పుల్ స్టాప్ పెడుతూ విడాకుల గురించి ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే.ఇలా వీరిద్దరి సోషల్ మీడియా వేదికగా అధికారికంగా విడాకుల గురించి తెలియజేయడంతో ఎంతోమంది అభిమానులు విడాకుల విషయం పట్ల షాక్ కి గురయ్యారు. ఈ క్రమంలోనే వీరు విడిపోతున్నారనే వార్తను ఎవ్వరూ జీర్ణించుకోలేక ఓ అభిమాని చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Dhanush – Aishwarya Divorce: ధనుష్, ఐశ్వర్య.. విడాకులకు ఉదాహరణగా సమంత.. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నెటిజన్లు!

ఈ సందర్భంగా నటించిన స్పందిస్తూ అమ్మ లక్ష్మి రామకృష్ణన్ మీరే ఎలాగైనా వారిని కలపాలని కోరారు. ఇలా నెటిజెన్ చేసిన ట్వీట్ కు సదరు నటి స్పందిస్తూ… వారిద్దరూ పరస్పరం ఒకరిపై మరొకరు గౌరవభావంతో విడిపోతున్నారు. వారిద్దరూ ఇతరులతో రొమాన్స్ చేయకుండా ఒకరిపై ఒకరు నోరు పారేసుకోకుండా ఎంతో గౌరవంగా విడిపోయారు కనుక వారిని అలాగే బ్రతకనిద్దాం అంటూ సమాధానం చెప్పారు.

Dhanush – Aishwarya Divorce: ధనుష్, ఐశ్వర్య.. విడాకులకు ఉదాహరణగా సమంత.. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నెటిజన్లు!

ఇలా ఈమె చెప్పిన సమాధానానికి నెటిజెన్ స్పందిస్తూ… వారి నిర్ణయాన్ని నేను గౌరవిస్తాను కాని వారిద్దరూ ఇలా ప్రకటించకుండా సైలెంట్ గా విడిపోయి ఉంటే బాగుండేది ఇలా చేయటం వల్ల ప్రతి ఒక్కరికి చెడు సంకేతాలు వెళ్తాయని నెటిజెన్ తన సమాధానం చెప్పారు. దీంతో ఈమె మరొకసారి స్పందించాల్సి వచ్చింది..

సమంత ఒక ఉదాహరణ..

ఈ సందర్భంగా లక్ష్మి మాట్లాడుతూ ఒకవేళ వారు విడిపోతున్నట్లు తెలియజేయకపోతే.. వారి అనుమతి లేకుండా ఇష్టమొచ్చినట్లు వారి గురించి వార్తలు అల్లుతారు. అంతెందుకు సమంత నాగచైతన్య విడాకుల గురించి ప్రకటించినప్పటికీ సమంత దారుణమైన విషయాలను భరించాల్సి వచ్చింది అంటూ సమంత ఉదాహరణగా పేర్కొన్నారు. దీంతో సమంత అభిమానులు మధ్యలో సమంతను ఎందుకు లాగుతున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా ఐశ్వర్య ధనుష్ విడాకుల గురించి నెటిజన్, నటి లక్ష్మీ రామకృష్ణన్ మధ్య జరిగిన ఈ సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago