Dhanush: కొత్త గర్ల్ ఫ్రెండ్ తో ధనూష్..! అందుకే ఐశ్వర్యకు విడాకులా..?
Dhanush: తమిళంలోనే కాకుండా.. తెలుగులో కూడా హీరో ధనూష్ మంచి పేరు తెచ్చుకున్నాడు. అతడికి సంబంధించి సినిమాలు తెలుగులో డబ్బింగ్ అయి ఎక్కువగా కలెక్షన్లకు తెచ్చిపెట్టాయి. ఇలా తెలుగులో కూడా ఎక్కువగా అభిమానులను సంపాదించుకున్నాడు ధనూష్.
ఇక ప్రస్తుతం ఈ హీరో.. బడా డైరెక్టర్స్ తో సినిమాలకు కమిట్ అవుతూ.. బిజీబిజీగా ఉన్నాడు. అయితే కెరీర్ పరంగా మాత్రం మంచి ఫామ్ లో దూసుకుపోతున్న ధనూష్ వ్యక్తిగత జీవితంలో మాత్రం ధనూష్ హాట్ టాపిక్ గా మారుతున్నాడు.
ఇటీవల అతడు తన భార్య ఐశ్వర్యకు విడాకులు ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఎంతో మంది అభిమానులు షాక్ అయ్యారు. ఎవరూ ఊహించని విధంగా అతడు 18 ఏళ్ల వైవాహిక బంధానికి ఎండ్ కార్డ్ పెట్టేశాడు. దీంతో వాళ్ల విడాకులకు సంబంధించి వివిధ రకాల విషయాలు ట్రోల్ అవుతున్నాయి.
ధనూష్ కు వేరే హీరోయిన్ తో ఎఫైర్ ఉండటం వల్లనే ఐశ్వర్యకు విడాకులు ఇచ్చాడని కోలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. అయితే ఈ విషయం ఎంత వరకు నిజమో తెలియదు కానీ.. ధనూష్ మాత్రం ఓ అమ్మాయితో దిగిన ఫొటో వైరల్ గా మారింది. దీంతో మరోసారి ధనూష్ విడాకుల ప్రస్తావన మరొకసారి ట్రెండింగ్ గా మారింది.
అస్సలు ఇది ఎలా బటయట పడిందంటే.. హైదరాబాద్ లో అతడు ఓ హోటల్ కు లంచ్ కు వచ్చాడు. ఆ విషయాన్నే ఆ హోటల్ మేనేజ్ మెంట్, ధనూష్ పీఆర్ టీం సోషల్ మీడియాలో షేర్ చేశాయి. అయితే వాళ్లు షేర్ చేసిన వాటిల్లో ధనుష్ పక్కన కూర్చొని ఓ అమ్మాయి భోజనం చేస్తోంది. దీంతో ఆ ఫొటోపై నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. ఆ అమ్మాయే ధనూష్ కొత్త గర్ల్ ఫ్రెండ్ అంటూ వార్తలు వస్తున్నాయి. దీనిపై ధనూష్ అభిమానలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పక్కన కూర్చొని భోజనం చేస్తే లవర్ అయిపోతుందా అంటూ మండిపడుతున్నారు. ఇలాంటివి నెట్టింట్లో ఎన్ని వైరల్ అవుతున్నా.. ధనూష్ గానీ.. వాళ్ల పీఆర్ టీం గానీ స్పందించకపోవడం విశేషం.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…