చక్కటి కళ్ళు,ఆకట్టుకునే అందం, తెలుగు సినిమాల్లో అప్పుడప్పుడు కనిపిస్తూ.. ప్రేక్షకులను ఆహ్లాద పరుస్తూ కనిపించే నటీ మరెవరో కాదు… ధన్య భాలకృష్ణ ఒక దక్షిణాది భారతీయ చలన చిత్ర నటి. ఆమె తెలుగు, తమిళ చిత్రాలలో నటించింది. ఆమె మురుగ దాస్ దర్శకత్వం వహించిన “7అమ్ అరివు” తెలుగులో( 7త్ సెన్స్) ద్వారా నటిగా పరిచయమైంది.
ధన్య భాలకృష్ణ బెంగులూరులో పుట్టి పెరిగిన తమిళ అమ్మాయి. ఆమె సూర్య, శ్రుతి హాసన్ నటించిన 7అమ్ అరివు తెలుగులో (7త్ సెన్స్) ద్వారా నటిగా పరిచయమైంది. ఆ తరువాత ఆమె రెండు తమిళ-తెలుగు ద్విభాషా చిత్రాలు లవ్ ఫెయిల్యూర్ (తమిళంలో కాదల్ సొదప్పువది ఎప్పిడి), ఎటో వెళ్ళిపోయింది మనసు(తమిళంలో నీతానే ఎన్ పొన్వసంతం) లో నటించింది.
ఆ తరువాత ఆమె 2013లో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లో మహేశ్ బాబుని ప్రేమించాననే అమ్మాయి పాత్రలో నటించింది. రాజా రాణి చిత్రంలో ఆమె నయన తార స్నేహితురాలైన నివేతా పాత్ర పొషించింది. ఆమె కథనాయికగా నటించిన తొలి చిత్రం “చిన్ని చిన్ని ఆశ” నవంబరు 2013లో విడుదలైనది. ఆమె తదుపరి చిత్రాలు “చందమామలో అమృతం”, “సెకండ్ హ్యండ్” తరువాత విడుదలైనవి.
2001 శ్రీ సూర్య మూవీస్, ఏఎం రత్నం నిర్మాణం, ఎస్.జె.సూర్య దర్శకత్వంలో “ఖుషి” చిత్రం విడుదలయింది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్, భూమిక హీరో, హీరోయిన్లుగా నటించారు. ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ అందించిన స్వరాలు సినిమా విజయానికి ప్రధాన కారణంగా నిలిచాయి. అయితే ప్రముఖ హీరోయిన్ ధన్య బాలకృష్ణ మాట్లాడుతూ… తను చిన్నప్పుడు అనేక తమిళ, తెలుగు, మలయాళ, కన్నడ చిత్రాలు చూసేదాన్ని, తెలుగు సినిమాలు చూస్తున్న క్రమంలో ఒకసారి పవన్ కళ్యాణ్ నటించిన “ఖుషి” చిత్రాన్ని చూశానని..
అందులో పవన్ కళ్యాణ్ బాడీ లాంగ్వేజ్, డ్రెస్సింగ్ ఆయన క్రాఫ్ నన్ను బాగా ఆకర్షించాయని.. ఒక విధంగా చెప్పాలంటే ఆయన మీద క్రష్ కాదు అంతకంటే ఎక్కువేమో అనిపిస్తుంది. ఆ సినిమా చూసిన తర్వాత దాదాపు కొన్ని రోజులు ట్రాన్స్ లోకి వెళ్లానని.. అప్పటినుంచి ఆయనను నేను ఆరాధిస్తున్నాను. ఎప్పటికైనా పవన్ కళ్యాణ్ తో నటించే అవకాశం వస్తుందని.. ఆ అవకాశం కోసం ఎదురుచూస్తున్నానని ధన్య భాలకృష్ణ వివరించారు.
ఇరాన్ అణు కార్యక్రమం అంశంపై అమెరికా మరోసారి కఠిన స్వరాన్ని వినిపించింది. అమెరికా అధ్యక్షుడు Donald Trump తాజాగా చేసిన…
దక్షిణాదిలో ఒక కాలంలో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన నటీమణుల్లో Meena ప్రత్యేక స్థానం సంపాదించారు. చిన్న వయసులోనే సినిమాల్లోకి అడుగుపెట్టి,…
జుట్టు రాలడం ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా చాలా మందిని వేధిస్తున్న సమస్యగా మారింది. యువత నుంచి మధ్యవయసు వారిదాకా…
ఉమ్మడి మెదక్ జిల్లాలో వీధి కుక్కల సమస్య రోజురోజుకీ తీవ్రమవుతోంది. చిన్నారులు, మహిళలు, వృద్ధులు అనే తేడా లేకుండా వరుసగా…
ఆస్పత్రి అంటే రోగి ప్రాణాలు కాపాడే స్థలం. కానీ కొన్నిసార్లు అక్కడే జరిగిన నిర్లక్ష్యం బాధితులకు జీవితాంతం మానని గాయాలు…
విశాఖ సాగరతీరంలో ఆదివారం జరిగిన నావికాదళ ప్రదర్శనలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. RK Beach వేదికగా నిర్వహించిన ‘ఆపరేషనల్ డెమో’…