టాలీవుడ్లో సూర్య, శ్రుతిహాసన్ జంటగా నటించిన ‘సెవంత్ సెన్స్’ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది ధన్య బాలకృష్ణ..ఆ సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ గా నటించింది ధన్య.. ఇక ఆ తర్వాత లవ్ ఫెయిల్యూర్, ఎటో వెళ్లిపోయింది చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది.వాటితో పాటు విక్టరీ వెంకటేశ్, మహేశ్‌బాబు మల్టీస్టారర్ ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రంలో ఒక సీన్‌లో నటించి మెప్పించింది.
నేను శైలజ’, ‘రాజు గారి గది’, ‘రాజారాణి’, ‘సాఫ్ట్‌వేర్ సుధీర్’, ‘అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి’ వంటి పలు చిత్రాలు ఆమెకు ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టాయి.లాక్‌డౌన్ కారణంగా హోమ్ క్వారంటైన్‌లో ఉన్న ధన్య తాజాగా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో ముచ్చటించింది. అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. తన ముద్దు పేరు పప్పు అని, ప్రస్తుతం బెంగళూరులో ఉన్నానని వెల్లడించింది.
‘రాజారాణి’ సినిమాలో మందు తాగినట్లు చూపించారు, కానీ అది నిజం కాదని స్పష్టం చేసింది. తాను తాగింది కేవలం మంచినీళ్లు మాత్రమేనని తెలిపింది.. అంతేకాకుండా సీతమ్మ వాకింట్లో సిరిమల్లె చెట్టు’లో మహేశ్ బాబుతో కలిసి పనిచేయడం ఎలా ఉంది అని ఓ అభిమాని ప్రశ్నించగా.. ”సూపర్బ్! ఆయన ఎంతో మంచి మనస్సున్న, ఓర్పు, సహనం కలిగిన వ్యక్తి. ఆయనతో కలిసి పనిచేయడం నాకు బాగా నచ్చింది.” అని జవాబిచ్చింది.
ఎక్కువగా పార్టీలు కూడా చేసుకోనని, ప్రతి వీకెండ్‌లో మాత్రం స్నేహితులతో కలిసి భోజనానికి వెళ్తానని చెప్పుకొచ్చింది..అప్పుడప్పుడు ఫ్రెండ్స్ తో కలిసి లాంగ్ డ్రైవ్స్ లేదా కాఫీ తాగడానికి వెళ్తాను.” అని చెప్పింది.. ఇక సినిమా ఇండస్ట్రీలో పవన్ కల్యాణ్, సూర్య, రణ్‌బీర్ కపూర్ తన క్రష్‌లని, వీరితో సినిమా చేయాలనుందని మనసులో మాట బయటపెట్టింది. ప్రస్తుతం ఆమె తెలుగులో కన్నా తమిళ, కన్నడ సినిమాల్లో హీరోయిన్‌గా రాణిస్తోంది…!!
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్‌కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…
అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుతం దేశ రాజకీయాల్లో అత్యంత ప్రభావశీల నాయకుడిగా కొనసాగుతున్న డొనాల్డ్ ట్రంప్ మరోసారి వలసల అంశంపై…
ఈ రోజుల్లో మనం దుస్తులు కొనేటప్పుడు ఎక్కువ సమయం రంగు, డిజైన్ లేదా ధర గురించి ఆలోచిస్తాం. కానీ వాటన్నింటికంటే…