‘మహేష్ బాబు’ పై సంచలన వ్యాఖ్యలు చేసిన ధన్య బాలకృష్ణ..!!

0
32

టాలీవుడ్లో సూర్య, శ్రుతిహాసన్ జంటగా నటించిన ‘సెవంత్‌ సెన్స్‌’ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది ధన్య బాలకృష్ణ..ఆ సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ గా నటించింది ధన్య.. ఇక ఆ తర్వాత లవ్‌ ఫెయిల్యూర్‌, ఎటో వెళ్లిపోయింది చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది.వాటితో పాటు విక్టరీ వెంకటేశ్‌, మహేశ్‌బాబు మల్టీస్టారర్‌ ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రంలో ఒక సీన్‌లో నటించి మెప్పించింది.

నేను శైలజ’, ‘రాజు గారి గది’, ‘రాజారాణి’, ‘సాఫ్ట్‌వేర్‌ సుధీర్‌’, ‘అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి’ వంటి పలు చిత్రాలు ఆమెకు ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టాయి.లాక్‌డౌన్‌ కారణంగా హోమ్‌ క్వారంటైన్‌లో ఉన్న ధన్య తాజాగా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో ముచ్చటించింది. అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. తన ముద్దు పేరు పప్పు అని, ప్రస్తుతం బెంగళూరులో ఉన్నానని వెల్లడించింది.

‘రాజారాణి’ సినిమాలో మందు తాగినట్లు చూపించారు, కానీ అది నిజం కాదని స్పష్టం చేసింది. తాను తాగింది కేవలం మంచినీళ్లు మాత్రమేనని తెలిపింది.. అంతేకాకుండా సీతమ్మ వాకింట్లో సిరిమల్లె చెట్టు’లో మహేశ్ బాబుతో కలిసి పనిచేయడం ఎలా ఉంది అని ఓ అభిమాని ప్రశ్నించగా.. ”సూపర్బ్‌! ఆయన ఎంతో మంచి మనస్సున్న, ఓర్పు, సహనం కలిగిన వ్యక్తి. ఆయనతో కలిసి పనిచేయడం నాకు బాగా నచ్చింది.” అని జవాబిచ్చింది.

ఎక్కువగా పార్టీలు కూడా చేసుకోనని, ప్రతి వీకెండ్‌లో మాత్రం స్నేహితులతో కలిసి భోజనానికి వెళ్తానని చెప్పుకొచ్చింది..అప్పుడప్పుడు ఫ్రెండ్స్ తో కలిసి లాంగ్‌ డ్రైవ్స్‌ లేదా కాఫీ తాగడానికి వెళ్తాను.”  అని చెప్పింది.. ఇక సినిమా ఇండస్ట్రీలో పవన్‌ కల్యాణ్‌, సూర్య, రణ్‌బీర్‌ కపూర్‌ తన క్రష్‌లని, వీరితో సినిమా చేయాలనుందని మనసులో మాట బయటపెట్టింది. ప్రస్తుతం ఆమె తెలుగులో కన్నా తమిళ, కన్నడ సినిమాల్లో హీరోయిన్‌గా రాణిస్తోంది…!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here