నట సింహం బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.. సినిమాలో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది.. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో బాలకృష్ణ డ్యుయల్ రోల్ చేస్తున్నారు. అందులో భాగంగా ఒక పాత్రలో బాలయ్య అఘోరా లుక్ లో కనిపిస్తారని సమాచారం. ఇక ఇటీవల విడుదలైన అఖండ టీజర్ 55 మిలియన్ల వ్యూస్‌తో యూట్యూబ్‌లో రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది.
మే 28న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఈ సినిమా వాయిదా పడే అవకాశం ఉంది..ఈ సినిమా తర్వాత క్రాక్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన డైరెక్టర్ గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమాను చేయనున్నారు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఇటీవలే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది. గోపిచంద్ గతంలో డాన్ శీను, బలుపు, పండగ చేస్కో లాంటి సినిమాలతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
ఇక రవితేజ హీరోగా వచ్చిన క్రాక్ బాగా ఆకట్టుకుంది. ఇక బాలయ్య సినిమా విషయానకి వస్తే.. పల్నాటి ప్రాంతానికి చెందిన ఓ చరిత్రకారుడి కథ ఆధారంగా ఈ సినిమా రానుందట. జూలై నుండి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం.వచ్చే సంక్రాంతికి సినిమాని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట చిత్రబృందం. ఈ కథలో బాలకృష్ణ ఫ్యాక్షన్ లీడర్, పోలీస్ ఆఫీసర్ పాత్రల్లో కనిపిస్తారని సమాచారం.
అందుకే ఇందులో ఇద్దరు హీరోయిన్లు ఉండనున్నారు.ఇక ఒక హీరోయిన్‌గా శ్రుతిహాసన్ అనే టాక్ వినిపిస్తోంది. గోపిచంద్ మలినేనికి శ్రుతిహాసన్ లక్కీ హీరోయిన్‌గా మారింది. ఆమెతో చేసిన ‘బలుపు, క్రాక్’ రెండూ మంచి విజయాలను అందుకున్నాయి. దీంతో గోపీచంద్ మరోసారి శృతి హాసన్‌ను హీరోయిన్‌గా తీసుకోనున్నారట. ప్రస్తుతం శృతి హాసన్ ప్రభాస్‌తో సలార్ అనే సినిమా చేస్తోంది..!!
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…