Movie News

మరోసారి రిపీట్ కానున్న ‘ఫిదా’ కాంబో.. ఇక ఆడియన్స్ కి పండగే..!!

మెగా హీరో వరుణ్ తేజ్, సాయి పల్లవి కాంబినేషన్ లో వచ్చిన ‘ఫిదా’ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. క్లాస్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన ఆ చిత్రం హిట్ సినిమాకు కొత్తం అర్దం చెప్పినట్లుగా కలెక్షన్స్ వర్షం కురిపించింది..అంతేకాదు సినిమాలో సాయి పల్లవి తన అందం, అభినయం తో ప్రేక్షకుల్ని మంత్ర ముగ్ధుల్ని చేసింది.. అంతే కేవలం ఆ ఒక్క సినిమాతో ఓవర్ నైట్ సెన్సేషన్ గా మారి ఫుల్ బిజీ అయ్యిపోయింది.

దాంతో ఇప్పుడు అదే కాంబినేషన్ ని రిపీట్ చేస్తున్నారు. ఇంతకీ ఎవరా డైరక్టర్, ఏమా కథ అంటారా..కరోనా సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు వరుణ్ తేజ్. ప్రస్తుతం కిరణ్‌ కొర్రపాటి దర్శకత్వంలో ‘గని’ అనే స్పోర్ట్స్‌ డ్రామా చేస్తున్నారు వరుణ్‌ తేజ్‌.అలాగే అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్‌తో కలసి ‘ఎఫ్‌ 3’ చిత్రంలోనూ నటిస్తున్నారు. కరోనా సెకండ్‌ వేవ్‌ కారణంగా ఈ రెండు సినిమాల చిత్రీకరణకు బ్రేక్‌ పడింది.

ఈ గ్యాప్‌లోనే ‘ఛలో, భీష్మ’ చిత్రాల ఫేమ్‌ వెంకీ కుడుముల చెప్పిన స్టోరీ లైన్‌ విన్నారట వరుణ్‌. వెంకీ చెప్పిన స్టోరీ లైన్‌ నచ్చడంతో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు వరుణ్‌ తేజ్‌.ప్రస్తుతం నటిస్తున్న ‘గని, ఎఫ్‌ 3’ చిత్రాల షూటింగ్‌ పూర్తయిన వెంటనే వెంకీ కుడుముల ప్రాజెక్టును పట్టాలెక్కించనున్నారని సమాచారం. అన్నీ కుదిరితే దసరాకి చిత్రీకరణ మొదలుపెట్టాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్‌ నిర్మించనుందని తెలిసింది.

ఈ సినిమాలో వరణ్ సందేశ్ సరసన సాయి పల్లవిని ఎంపిక చేసారు. ప్రస్తుతం ఈ మేరకు టాక్స్ జరుగుతున్నాయి. అయితే కరోనా సమస్యతో డేట్స్ అందరివీ డిస్ట్రబ్ అయ్యిపోయాయి. దాంతో సాయి పల్లవి తను ఖచ్చితంగా ఫలానా తేదీ నుంచి డేట్స్ ఇవ్వగలను అని చెప్పలేనని అందిట. ఇక మరోవైపు దర్శకుడు వెంకీ ఇప్పటికే వరుణ్ కి ఒక నెరేషన్ ఇచ్చాడు. త్వరలోనే ఫైనల్ స్క్రిప్ట్ చెప్పాల్సి ఉంది. ప్రస్తుతం కథకు తుది మెరుగులు దిద్దే పనిలో బిజీగా ఉన్నాడు వెంకీ కుడుముల..!!

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సీఎం విజయ్ కీలక నిర్ణయం.. 14 లక్షల మందికి పైగా రైతులకు లబ్ధి..

వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…

13 hours ago

పేద దేశాల నుంచి వలసలకు బ్రేక్.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. అమెరికా భవిష్యత్తుపై ఆందోళన

అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుతం దేశ రాజకీయాల్లో అత్యంత ప్రభావశీల నాయకుడిగా కొనసాగుతున్న డొనాల్డ్ ట్రంప్ మరోసారి వలసల అంశంపై…

13 hours ago

మన బట్టలపై కనిపించే S, M, L సైజ్ ట్యాగ్ వెనుక భారీ చరిత్ర..

ఈ రోజుల్లో మనం దుస్తులు కొనేటప్పుడు ఎక్కువ సమయం రంగు, డిజైన్ లేదా ధర గురించి ఆలోచిస్తాం. కానీ వాటన్నింటికంటే…

14 hours ago

బాలుడి చివరి కోరిక తీర్చేందుకు హన్మకొండకు పవన్ కళ్యాణ్..

రాజకీయ నాయకుడిగా, సినీ నటుడిగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్…

15 hours ago

జామకాయ తర్వాత ఈ ఆహారాలు తీసుకుంటే ఆరోగ్యానికి ముప్పే!

జామపండు అంటే చాలా మందికి ఇష్టమైన పండు. తక్కువ ధరలో లభించే ఈ పండులో ఆరోగ్యానికి అవసరమైన ఎన్నో పోషకాలు…

16 hours ago

పెళ్లిపై మనసు విప్పిన శ్రీముఖి.. అతన్ని వెంటనే పెళ్లి చేసుకుంటానంటూ ఆసక్తికర వ్యాఖ్యలు

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న శ్రీముఖి మరోసారి వార్తల్లో నిలిచింది. తన చురుకైన యాంకరింగ్,…

17 hours ago