Dharam Censor Board: ఈ మధ్యకాలంలో సినిమాలు లేదా ఓటీటీలలో వచ్చే వెబ్ సిరీస్ లలో పెద్ద ఎత్తున ఇతర మతాలను కించపరుస్తూ ఉండే విధంగా సన్నివేశాలను లేదా పాటలను చిత్రీకరించడం జరుగుతుంది.ఈ క్రమంలోనే తమ మతాన్ని కించపరుస్తున్నారంటూ ఇప్పటికే ఎంతోమంది కొన్ని సినిమాలలోనూ అలాగే పాటల పైన పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతూ ఆ సినిమాలను బైకాట్ చేయాలని డిమాండ్లు చేశారు.
ముఖ్యంగా షారుఖ్ ఖాన్ దీపిక పదుకొనే నటించిన పటాన్ సినిమా కూడా ఇలాంటి వివాదాన్ని ఎదుర్కొందని చెప్పాలి. ఈ సినిమాలో బేషరమ్ రంగ్ సాంగ్ విషయంలో మరింత వివాదం చోటుచేసుకుంది ఈ పాటలో దీపిక పదుకొనే వేసుకున్నటువంటి వస్త్రధారణ రంగు కాషాయం కావడంతో హైందవ ధర్మం ఈ పాటపై తీవ్రస్థాయిలో వ్యతిరేకత చూపించింది.
ఇకపై సినిమాలలో ఇలా మతాలను కించపరిచే విధంగా సన్నివేశాలు పాటలు ఉండకూడదన్న నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ లోని లక్నోకు చెందిన శంకరాచార్య జ్యోతిష్య పీఠాధిపతి స్వామి అవిముక్తేశ్వర నందన్ ధరమ్ సెన్సార్ బోర్డ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆదివారం హరిద్వార్ లో ఈ సెన్సార్ బోర్డు కార్యక్రమాన్ని
ఏర్పాటు చేశారు.
ఇకపై సినిమా, ఓటీటీల్లో ఎంటర్టైన్మెంట్ పేరు చెప్పి ఒకరి మత మనోభావాలు దెబ్బ తీసేలా కంటెంట్ తెరకెక్కించాలనుకునే వాళ్లకు కళ్లెం వేయాలనేదే ఈ సెన్సార్ బోర్డు లక్ష్యం అంటూ తెలియజేశారు.అయితే ఈ సెన్సార్ బోర్డ్ ఏర్పాటు చేయడానికి గల కారణం పఠాన్ సినిమాలోని బేషరమ్ రంగ్ సాంగ్ కూడా ప్రధాన కారణమని తెలియజేశారు.
ప్రకృతిలో జరిగే కొన్ని ఖగోళ అద్భుతాలు మన కళ్లకు నేరుగా కనిపించకపోయినా వాటి ప్రభావాన్ని మాత్రం మనం స్పష్టంగా అనుభవిస్తాం.…
చిన్న వయసులో ఆరోగ్యం గురించి పెద్దగా ఆలోచించని వారు చాలా మంది ఉంటారు. "ఇప్పుడేం కాదు.. తర్వాత చూసుకుందాం", "ఇంకా…
ఈ రోజుల్లో డబ్బు లేకుండా ఏ పని జరగని పరిస్థితి. ఉదయం ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టిన దగ్గర…
మన తెలుగు వంటింట్లో కరివేపాకుకు ప్రత్యేక స్థానం ఉంది. పప్పు నుంచి పులుసు వరకు, చట్నీ నుంచి ఫ్రై వరకు…
హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…
వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…