Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి తెలుగు చిత్ర పరిశ్రమలో నటుడుగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు ఇప్పటికీ ఈయన వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి తనదైన శైలిలో ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవి ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా వాల్తేరు వీరయ్య సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు.
ఈ సినిమా జనవరి 13వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఈ సినిమా ప్రీరిలీజ్ వేడుకను వైజాగ్ లో ఎంతో ఘనంగా నిర్వహించారు. అయితే ఈ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ తనకు ఎప్పటినుంచో వైజాగ్ లో స్థిరపడాలని కోరిక ఉందని త్వరలోనే తాను వైజాగ్ వాసిని అవుతాను అంటూ చిరు తెలిపారు.
తాను వైజాగ్ లో ఇంటి నిర్మాణం కోసం ఇప్పటికే స్థలం కూడా కొనుగోలు చేశాను. ఈ ఏడాది ఇంటి నిర్మాణం చేపడతానని ఇల్లు మొత్తం పూర్తి కాగానే తాను వైజాగ్ లో స్థిరపడతానని చెప్పడంతో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. ఈయన భీమిలిలో సముద్రానికి దగ్గరగా ఇంటి స్థలం కొనుగోలు చేశారని తెలుస్తోంది.
ఈ ప్రాంతంలో సముద్రపు వ్యూ ఉండేలా ఇంటి నిర్మాణం చేపట్టాలని ఆలోచనలో మెగాస్టార్ ఉన్నట్లు సమాచారం. ఇలా అన్ని సౌకర్యాలకు అనుగుణంగా చిరంజీవి ఇంటి నిర్మాణం చేపట్టిన అనంతరం వైజాగ్ లోనే స్థిరపడిపోతారని తెలుస్తోంది. అయితే నిర్మాణం కోసం చిరంజీవి కొనుగోలు చేసిన స్థలం విలువ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ ఇంటి నిర్మాణం కోసం చిరంజీవి ఏకంగా 30 కోట్లకు పైగా డబ్బు కేటాయించి స్థలం కొనుగోలు చేశారని వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజముందో తెలియాల్సి ఉంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…