Samantha: టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ సమంత గత కొంతకాలంగా మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్న విషయం మనకు తెలిసిందే.ఈ వ్యాధి కారణంగా ఈమె నటించాల్సిన సినిమాలు అన్నీ కూడా ప్రస్తుతం వాయిదా పడ్డాయి.ఇలా అనారోగ్యంతో బాధపడుతూనే ఒకవైపు చికిత్స తీసుకుంటూ మరోవైపు ఈమె నటించిన యశోద, శాకుంతలం సినిమాలకు డబ్బింగ్ పనులు కూడా పూర్తి చేశారు.
ఇక తాజాగా శాకుంతలం సినిమా ట్రైలర్ లాంచ్ వేడుక ఎంతో ఘనంగా జరిగింది. ఈ సినిమా ఫిబ్రవరి 27వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో ఈ సినిమా నుంచి ట్రైలర్ లాంచ్ చేశారు.ఈ క్రమంలోనే సమంత ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా డైరెక్టర్ గుణ శేఖర్ వేదికపై మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు.20 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి ఒక్కడు సినిమాని ఇప్పటికి ఎంతో ఆదరిస్తున్నారు. అలాగే ఈ సినిమాను కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నాను అంటూ తెలిపారు.
ఇక ఈ సినిమాకి ముగ్గురు హీరోలు కథకు కథానాయకుడు దేవ్ మోహన్ హీరో అయితే సినిమాకి హీరో సమంత.ఇక ఈ సినిమాని తెర వెనుక ఉండి నడిపిస్తున్న దిల్ రాజు గారు కూడా ఈ సినిమాకి హీరో అంటూ ఈయన శాకుంతలం సినిమా గురించి మాట్లాడుతూ కాస్త ఎమోషనల్ అయ్యారు.
ఇక గుణశేఖర్ వేదికపై ఎమోషనల్ అవడంతో అక్కడే ఉన్నటువంటి సమంత కూడా ఎమోషనల్ అవుతూ ఏకధాటిగా కన్నీళ్లను కార్చింది. ఇలా తన పరిస్థితిని తలుచుకొని సమంత ఏకధాటిగా ఏడుస్తూ కన్నీళ్లను తుడుచుకున్నారు. అయితే అభిమానుల అరుపులకు ఈమె తేరుకొని అనంతరం నవ్వేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎంతో మంది అభిమానులు సమంతకు ధైర్యం చెబుతూ కామెంట్లు చేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…