Featured

Flash Back : వైయస్ రాజశేఖర్ రెడ్డిని నేనే బలవంతంగా సినిమాలకు తీసుకెళ్లేవాడిని.. కానీ ఆయన… : ధర్మవరపు సుబ్రమణ్యం.

Flash Back : హాస్యం అనగానే ఆనాటి నటులయిన రేలంగి, రమణారెడ్డి, అల్లు రామలింగయ్య లు గుర్తుకొస్తారు.. ఆ తర్వాత తరంలో బ్రహ్మానందం, ధర్మవరపు సుబ్రహ్మణ్యం గుర్తుకొస్తారు. సంభాషణలు పలకకుండా ముఖ కవలికలతో హాస్యం పుట్టించే అతికొద్ది మంది హాస్యనటుల్లో ధర్మవరపు సుబ్రహ్మణ్యం ఒకరు. బుల్లితెర, వెండితెర అని తేడా లేకుండా తన హాస్యంతో తెలుగు ప్రజలందరినీ అభిమానులుగా ఆయన మార్చుకున్నారు.

దూరదర్శన్ లో ఉండగానే ఆయనకు జంధ్యాల సినిమా జయమ్ము నిశ్చయమ్మురాలో అవకాశం వచ్చింది. దాంతో పలు సినిమాల్లో ఆయనకు పాత్రలు లభించాయి. నటనలో తలమునకలై ఉండగానే “తోక లేని పిట్ట” అనే సినిమాకు దర్శకత్వం, సంగీత దర్శకత్వం వహించాడు. అయితే ఆ సినిమా ఆశించనంతగా ఆడకపోవడంతో మళ్ళీ దర్శకత్వ బాధ్యతల జోలికి పోలేదు.

నువ్వు నేను, ధైర్యం చిత్రాలు మొదలుకొని చాలా చిత్రాల్లో అధ్యాపక పాత్ర వేసి నవ్వించారు. అయితే ఆ పాత్రలను కించ పరిచే విధంగా మలుస్తూ ఉండటంతో క్రమంగా ఆ పాత్రలకు దూరమయ్యాడు. ఆయన నట ప్రస్థానంలో ఒక్కడు సినిమాలో చేసిన పాస్‌పోర్ట్ ఆఫీసర్ పాత్ర, వర్షం సినిమాలో వాతావరణ వార్తలు చదివే గాలి గన్నారావు, రెడీ సినిమాలో హ్యాపీ రెడ్డి అలియాస్ సంతోష్ రెడ్డి మొదలైన పాత్రలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఆలస్యం అమృతం సినిమాకు ఉత్తమ హాస్యనటుడిగా నంది అవార్డు అందుకున్నారు.

1989 ఎన్నికల సమయంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ తరవాత సాంస్కృతిక మండలి అధ్యక్షడిగా పనిచేశాడు… అయితే ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను సినిమాలతో పాటు రాజకీయాల్లోకి అడుగు పెట్టాల్సి వచ్చిందని తాను ఎప్పుడూ తామరాకుపై నీటి బిందువుల ఉన్నానేగాని రాజకీయ బురదలోకి దిగలేదని కాంగ్రెస్ లో తనకు వైయస్ రాజశేఖర్ రెడ్డితో సాంగత్యం ఉండేదని 1998-99 ప్రాంతంలో తాను రూపొందించిన యాడ్స్ అదేవిధంగా తాను నటించిన సినిమాలను చూడమని రాజశేఖర్ రెడ్డిని బలవంతంగా తీసుకువెళ్లే వాడినని కానీ ఆయనకు సినిమాలపై అంతగా ఆసక్తి ఉండేది కాదని ఎప్పుడూ రాజకీయాలు, ప్రజాసమస్యల పట్ల ఎక్కువ దృష్టి సారించే వారని ఆ ఇంటర్వ్యూలో ధర్మవరపు సుబ్రహ్మణ్యం చెప్పుకొచ్చారు.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago