Featured

Actress Sreeleela : వామ్మో లేత పిల్ల శ్రీలీల మాములు ముదురు కాదు.. ఇంత చిన్న వయసులో ఇన్ని ఆస్తులా ?

Actress Sreeleela : శ్రీలీల.. మొదట కన్నడ భాషలో అడుగుపెట్టి తెలుగు లో స్టార్ హీరోయిన్ గా ఎదుగుతున్న నటి. ఇక్కడే ఆమెకు నటిగా మంచి గుర్తింపు వస్తుందనే చెప్పాలి. ఆమె నటన చూసిన ప్రతి ఒక్కరు తెలుగు ఇండస్ట్రీకి మంచి హీరోయిన్ దొరికింది అని అనుకుంటున్నారు. ఇక ఈ రోజు మనం శ్రీలీల యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాం. లీల అంటూ ముద్దుగా పిలవబడే శ్రీలీల జూలై 14 , 2001 లో పుట్టింది. 21 ఏళ్ళ వయసులోనే ఆమె తెలుగు స్టార్ హీరో మాస్ మహారాజ రవి తేజ తో నటించే అవకాశాన్ని పొందింది. ఇక అమెరికాలో పుట్టిన శ్రీలీల బెంగుళూరు లో పెరిగింది. ఆమె చదువులు కూడా బెంగుళూరు లోనే పూర్తి చేసింది.

చిన్నతనం నుంచి క్లాసికల్ డ్యాన్స్ పై మంచి పట్టు ఉన్న శ్రీలీల ప్రస్తుతం ఎంబిబిఎస్ ఫైనల్ ఇయర్ చదువుతుంది. ఆమెకు చిన్నతనం నుంచి డాక్టర్ అవ్వాలనే కోరిక ఉండేది. ఇక ఆమె తల్లి స్వర్ణలత బెంగుళూరులో డాక్టర్ గా పని చేస్తుంది. ఇక స్వర్ణ లతకు శ్రీలీల జన్మించే సమయానికి ప్రముఖ వ్యాపార వేత్త సూరపనేని శుభాకర రావు తో విడాకులు జరిగిపోయాయి. అయితే శ్రీలీల తండ్రి గా సూరపనేని శుభాకర రావు పేరు అంతటా వినిపిస్తున్న సమయంలోనే అయన ఈ వార్తలను ఖండించాడు. తన తల్లి సింగల్ గానే శ్రీలీలను పెంచి పెద్ద చేసింది. ఇక ప్రస్తుతం తన తల్లి లాగానే ఆమె కూడా డాక్టర్ అవ్వాలని అనుకుంది.

అందుకే మెడిసిన్ లో సీట్ సంపాదించి చదువు పూర్తి చేస్తున్న సమయంలోనే ఆమెకు కన్నడ సినిమా నుంచి అవకాశాలు రావడం మొదలయ్యాయి. దాంతో తొలుత 2019 లో కిస్ అనే సినిమాలో నటించింది. ఆ తర్వాత అదే ఏడాది భరతే అనే మరో సినిమాలో నటించింది. ఆ తర్వాత రాఘవేంద్ర రావు దర్శకత్వం లో పెళ్లి సందడి సినిమా ఆమె కెరీర్ ని మలుపు తిప్పింది అనే చెప్పాలి. ఇక ఈ సినిమా చేస్తున్న సమయంలోనే మరో రెండు కన్నడా సినిమాల్లో నటించిన ప్రస్తుతం రవి తేజ తో ధమాకా అనే సినిమాలో నటిస్తుంది.ఈ సినిమా ఇప్పటికే పాటలు, ట్రైలర్స్ తో హల్చల్ చేస్తుంది. ప్రస్తుతం తెలుగు మరియు కన్నడ లో మల్టిపుల్ ప్రాజెక్ట్స్ చేస్తున్న శ్రీలీల చేసింది తక్కువ సినిమాలే అయినా బాగానే సంపాదించింది.

శ్రీలీల కార్స్, పారితోషకం, ప్రాపర్టీస్ విషయానికి వస్తే ఆమె దగ్గర ఆల్టో ఎస్ ప్రెస్సో కారు ఉంది. దీని ధర 5 లక్షలు కాగా, 17 లక్షల విలువ చేసే హోండా సిటీ కారు కూడా ఆమె గ్యారేజి లో ఉంది. ఇక ఆమె నటించిన మొదటి సినిమా కిస్ కోసం ఆమె 21 లక్షల పారితోషకం అందుకోగా పెళ్లి సందడి సినిమా కోసం 30 లక్షల రూపాయలు అందుకుంది. ఇక రవి తేజ తో నటిస్తున్న ధమాకా సినిమా కోసం దాదాపు 80 లక్షల రూపాయల పారితోషకం అందుకున్న శ్రీలీల ఈ సినిమా విజయవంతం అయితే తన పారితోషకం మరింత పెంచే అవకాశం ఉంది. ఇక ఆమె నివసిస్తున్న ఇల్లు, కార్లు, లక్సరీ వస్తువులతో కలిసి ఆమె మొత్తం నెట్ వర్త్ దాదాపు 7 నుంచి 8 కోట్ల వరకు ఉంటుంది.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago