Featured

Radha Krishna Love Story : కృష్ణుడు, రాధని ఎందుకు పెళ్లి చేసుకోలేదు..? 8 మంది భార్యలు, 16000 మంది గోపికలను ఎందుకు పెళ్లి చేసుకున్నాడు..!?

Radha Krishna Love story : ప్రేమ అనగానే మనకు గుర్తొచ్చే జంట రాధ కృష్ణులు. రాధ కృష్ణుల ప్రేమ నిస్వార్థ మైన ఆరాధన. ఎన్ని సార్లు వారి ప్రేమ కథ విన్నా మళ్ళీ వినాలనిపించే మధురమైన ప్రేమ కథ. అయితే కృష్ణుడు ఎందుకని రాధని పెళ్లి చేసుకోలేదు. వాళ్లిద్దరు ఎందుకని విడిపోయారు. రాధ కృష్ణుడి కంటే వయసులో పెద్దదైనా ఎలా వారి మధ్య ప్రేమ చిగురించింది. ఈ సందేహాలు చాలామంది మదిలో ఉండేవే.. కృష్ణుడికి ఎనిమిది మంది భార్యలు, 16,000 మంది గోపికలను ఎందుకు ఉన్నారు అంతమందిని ఎందుకు వివాహం చేసుకున్నారు…

అజరామరమైన ప్రేమ… ఎందుకు పెళ్లి చేసుకోలేదు..

రాధ కృష్ణుడికంటే పెద్దది దీనికి కారణం పురాణాల ప్రకారం మహా విష్ణువు ధర్మస్థాపనకు భూమి మీద శ్రీకృష్ణుడిగా జన్మించాలని అనుకున్న అంతకంటే ముందు లక్ష్మి దేవిని భూమి మీద జన్మించమని బ్రతిమలాగా ఆమె భూలోకంకి మీకంటే ముందే వెళ్లినా మీరు వచ్చే వరకు కళ్ళు తెరవను అని చెప్పి భూలోకం కి వెళ్తుంది. అలా ఒక యాదవుడికి నది పక్కన కలువ పువ్వులో దొరకగా ఆమెను ఆ యాధవ కుటుంబం పెంచుతారు . కానీ ఆమె పెద్దదవుతున్న కళ్ళు తెరవక పోవడంతో ఆందోళనకు గురవ్వుతారు. ఇక శ్రీకృష్ణుడు జననం మనకు తెలుసు. గోకులం మొదటి సారి శ్రీకృష్ణుడిని కలిసాక రాధ కళ్ళు తెరుస్తుంది.

అలా శ్రీకృష్ణుడు, రాధ కంటే చిన్నవాడిగా జన్మిస్తాడు. అలా మొదలైన వారి ప్రేమ కథ నేటికీ మధురంగానే ఉంది. ఇక కృష్ణుడు తాను జన్మించిన కర్తవ్యం కోసం మధుర వెళ్ళాలి అని అనుకున్నపుడు రాధ తనను పెళ్లి చేసుకుని వెంట తీసుకెళ్లామని బ్రతిమలాడినా.. ఆత్మలు ఒకటై జీవిస్తున్న మనకు పెళ్లి అవసరం లేదు అని కృష్ణుడు చెప్పి, మన జన్మల కారణం వేరని మన కర్తవ్యాల దిశగా అడుగులు వేయాలని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అక్కడ ఎనిమిది మంది భార్యలను పెళ్లి చేసుకున్న శ్రీ కృష్ణుడు మళ్ళీ పదహారు వేల మంది గోపికలను పెళ్లి చేసుకోడానికి కారణం.. మేనమామ కంసుడిని వదించిన తరువాత కంసుడి చేరలో ఉన్న పదహారు వేల మంది అమ్మాయిలను విడిపించి వారి కుటుంబం వద్దకు చేర్చగా వారిని స్వీకరించడానికి వారి కుటుంబాలు సిద్ధంగా లేకపోవడంతో కృష్ణుడు వారిని పెళ్లి చేసుకుని ఒక రాజభవనంలో వారిని ఉంచి జీవనం కల్పించాడు. అలా రాధకృష్ణులు దేహాలు వేరే అయిన వారి ఆత్మ ఒకటిగా జీవించారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago