Categories: FeaturedMovie News

Dhavala Sathyam : ఆ ఒక్క సినిమా వల్ల సినిమా కెరీర్ పోయింది.. రంగస్థలం సినిమా ఒకప్పటి చిరు సినిమా రీమేక్… : ధవళ సత్యం

Dhavala Sathyam : విప్లవ చిత్రాల దర్శకుడు ధవళ సత్యం తన చిత్రాల ద్వారా కమ్యూనిజం భావాలను చూపించాడు. ఎర్ర మల్లెలు, భీముడు, యువతరం కదిలింది, జాతర, చైతన్య రథం, నేను సైతం వంటి చిత్రాలను తీశారు. నాటక రంగంతో పరిచయమున్న ధవళ సత్యం, దాసరి నారాయణ రావు గారి శిష్యుడు. తాజాగా యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో అప్పటి జ్ఞాపకాలను పంచుకున్నారు.

రంగస్థలం అప్పటి నా సినిమా కథే…..

ఇక ధవళ సత్యం తన సినిమా ప్రస్థానం లో మైలురాయి వంటి సినిమా జాతర గురించి చెబుతూ జాతర సినిమాకు హీరో ఎంపిక కోసం చాలా కష్టపడ్డానని, చిరంజీవిని హీరోగా అనుకున్నా మిగిలిన చిత్ర బృందాన్ని ఒప్పించడానికి కష్టపడ్డానని, కానీ చివరకు చిరంజీవినే హీరోగా సినిమా తీసానని చెప్పారు. ఇక ఆ సినిమా నేడు మంచి కమర్షియల్ హిట్ అయి రామ్ చరణ్ కెరీర్ లో ది బెస్ట్ గా నిలిచిన రంగస్థలం సినిమా కథా ఒకటేనని చెప్పారు.

చిరంజీవి మంచి స్థాయికి వెళ్తాడని ఎపుడో తాను చెప్పానని అన్నారు. ఇక తన చైతన్య రథం సినిమా గురించిన విశేషాలను పంచుకున్నారు. వంగ వీటి రంగ జీవిత కథ ఆధారంగా వచ్చిన సినిమా చైతన్య రథం. అప్పటికే వచ్చిన ప్రతిఘటన సినిమాకు వ్యతిరేకంగా ఈసినిమా తీసారని రంగ కోసం ఈ సినిమా తీసారని విమర్శల నడుమ ఈసినిమా మంచి విజయాన్నందుకుంది. కానీ ఈ సినిమా తరువాత సత్యం కెరీర్ మసకబారింది, అవకాశాలు సన్నగిల్లాయి. ఆ ఒక్క సినిమా తన కెరీర్ లో ఎదగకపోడానికి కారణమని సత్యం చెప్పారు. అయితే సినిమా విషయంలో ఏ బాధలేదని తాను ఎలా తీయాలనుకున్నానో సినిమా అలా తీశానని తాను నమ్ముకున్న సిద్ధాంతాలను పక్కన పెట్టలేదని చెప్పారు. కమ్యూనిజం భావాలతో బ్రతికిన సత్యం తాను నమ్ముకున్న సిద్ధాంతాలను సినిమా రూపంలో చూపించి ప్రజలను చైతన్యపరిచారనడంలో సందేహం లేదు.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 month ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 months ago