K A PAUL : ప్రజా శాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఏ పాల్ ఈ మధ్య సోషల్ మీడియాలో మాట్లాడుతూ అందరికీ ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాడు. ఇటీవల పవన్ కళ్యాణ్ గురించి కేఏ పాల్ చేసిన వాఖ్యలు బాగా వైరల్ అవుతున్నాయి. లైవ్ వెబ్ సెషన్ లో కేఏ పాల్ తన భవిష్యత్ కార్యాచరణ, పవన్ కళ్యాణ్ రాజకీయ భవిష్యత్ గురించి మాట్లాడారు.
పవన్ ను సీఎం చేస్తా…..
ఇటీవల పవన్ కళ్యాణ్ మంగళగిరి పార్టీ ఆఫీస్ లో ప్రసంగిస్తూ పొత్తులపై మూడు ఆప్షన్స్ ఇస్తూ పోల్ పెట్టారు. మొదటి ఆప్షన్ లో బీజేపీతో పొత్తును కొనసాగిస్తూ ఎన్నికలకు సిద్ధం అవడం, రెండో ఆప్షన్ లో బీజేపీతో పొత్తు కొనసాగిస్తూ టీడీపీ తో కూడా పొత్తు కుదుర్చుకోవడం, ఇక మూడో ఆప్షన్ గా ఒంటరిగా జనసేన మాత్రమే పోటీచేయడం. ఈ మూడు ఆప్షన్లను జనసైనికుల ముందు ఉంచారు పవన్. అయితే ఇపుడు నాలుగో ఆప్షన్ ఇస్తున్నాడు కేఏ పాల్. ప్రజాశాంతి పార్టీ 2024లో 42 సీట్లను గెలిస్తే ప్రధాన మంత్రి అవుతాను, నేను పీఎం అయితే ఏపీ లో పవన్ ను సీఎంని చేస్తా, జనసైనికులకు చిత్తశుద్ధి ఉంటే ప్రజాశాంతి పార్టీలో చేరాలని పవన్ కళ్యాణ్ ప్రజాశాంతి పార్టీ లో చేరితే సీఎంని చేస్తాను అంటూ కామెంట్స్ చేసారు.
ఇక ఈ వాఖ్యలు ఇపుడు నెట్టింట్లో బాగా వైరల్ అవుతున్నాయి. ఇక పవన్ కళ్యాణ్ వ్యతిరేకులు మాత్రం ఈ కామెంట్స్ ను తెగ ఎంజాయ్ చేస్తున్నారు. పవన్ ఇచ్చిన మూడు ఆప్షన్స్ కన్నా ఈ నాలుగో ఆప్షన్ బాగుందని పవన్ జనసైనికులు ఆలోచించాలని సటైర్లు వేస్తున్నారు. మొత్తానికి కేఏ పాల్ మాత్రం తన మాటలతో తెగ ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…