Actress Nandita: ఢీ వేదికపై కన్నీళ్లు పెట్టుకొని ఎమోషనల్ అయిన జడ్జి నందిత శ్వేతా… వీడియో వైరల్!
Actress Nandita: బుల్లితెరపై ప్రసారం అవుతూ ఎంతో మంచి ఆదరణ దక్కించుకున్న ఢీ డాన్స్ షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రతివారం ప్రసారం అవుతూ ప్రేక్షకులను ఎంతగానో సందడి చేస్తున్న ఈ కార్యక్రమం వచ్చే వారం ప్రసారం కాబోయే ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో విడుదల అయ్యింది. ఈ ప్రోమో లో భాగంగా కంటెస్టెంట్ లు తమ అద్భుతమైన డాన్స్ పర్ఫార్మెన్స్ తో అందరినీ ఆకట్టుకున్నారు.
ఇక ఈ కార్యక్రమానికి న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తున్నటువంటి నటి నందితా శ్వేత ఢీ వేదికపై కన్నీళ్ళు పెట్టుకొని ఎమోషనల్ అయినట్టు ప్రోమోలో చూపించారు. ఇలా ఈమె ఎమోషనల్ అవడానికి గల కారణం ఏమిటి? అనే విషయానికి వస్తే..
నటి నందితా శ్వేత పుట్టినరోజు కావడంతో ఢీ వేదికపై ఈమెకు అడ్వాన్స్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి యాంకర్ గా వ్యవహరిస్తున్నటువంటి ప్రదీప్ ఒక గిఫ్ట్ బాక్స్ తీసుకువచ్చి నందితకు ముందుగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఇక ప్రదీప్ చేతుల మీదుగా బహుమతి అందుకున్న నందిత ఢీ వేదికపైనే ఆ గిఫ్ట్ బాక్స్ ఓపెన్ చేసి ఒక్కసారిగా ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకుని ఏడ్చారు. ఇలా ఈమె కంటతడి పెట్టుకోవడంతో అక్కడున్న వారందరూ షాకయ్యారు. అయితే గిఫ్ట్ బాక్స్ లో ఏముంది? అది చూడగానే నందిత ఎందుకు అంత ఎమోషనల్ అయింది అనే విషయం తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…