Featured

Nagababu : నాగబాబు నయా లుక్.. రాజకీయ నాయకుడు అంటే ఆ గెటప్ ఉండాల్సిందే…!

Nagababu new look for politics : జనసేన పార్టీ పెట్టి పదేళ్లు దాటిపోయింది. ఇక పోయిన ఎన్నికలలో జనసేన నుండి రెండు చోట్లకు పోటీ చేసారు పవన్ కళ్యాణ్ ఇక ఆయన అన్న నాగబాబు కూడా ఎంపీ గా పోటీ చేసి ఇద్దరు ఓడిపోయారు. ఇక ఆ తర్వాత నాగబాబు పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా కనిపించలేదు. టీవీ షోలతో బిజీగా ఉన్న నాగబాబు ఇక ఇపుడు కొత్త అవతారం లో కనిపిస్తూ నికార్సయిన రాజకీయనాయకుడి అవతారానికి మారిపోయారు.

చేతిలో బుక్, కళ్లద్ధాలు, తెల్లబట్టలు అచ్చం అలాగే….

ఇక రాజకీయనాయకులు అనగానే తెల్ల బట్టలు, సాధారణంగా ఉంటూ, గాంధీ లాగా నో నేతాజీ లాగో కనిపించాలి అని అనుకుంటారు. అలాంటి రూలు ఏమి లేకపోయినా ఆ గెటప్ లో ప్రజలకు దగ్గరవుతామని భావిస్తుంటారు.ఇక నాగబాబు కూడా ఇలాంటి గెటప్ లోకి మారిపోయాడు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఇంచు మించు ఇలాంటి గెటప్ లోనే ఉంటారు. ఈ మధ్య మళ్ళీ జనసేన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు నాగబాబు.తమ్ముడి మీటింగులకు హాజరువుతున్నారు.

ఇక గెటప్ లో సడన్ గా కనిపిస్తే బాగోదని ఒక సుదీర్ఘ పోస్ట్ ను కూడా సామజిక మద్యమం లో వదిలారు.ఈ జీవితం ప్రజా సేవకు ఇకపై అంకితం అంటూ రాసుకొచ్చారు. అంత బాగానే ఉన్న మరి ముందు ఎన్నికలలో పోటీ చేసినప్పుడు సంగతేంటి మరి ప్రజా సేవకు రాలేదా రాజకీయాల్లోకి వచ్చేదే ప్రజా సేవ చేయడానికి అంటుంటారు కదా మరి కొత్తగా ఈరోజు చెప్పడమేంటో మరి.రాజకీయాల్లోకి రావాలంటే చాలా త్యాగం చేయాలి అలాగే నాగబాబు కూడా ఇపుడు ఈ నయా గెటప్ కోసం తన రంగు బట్టలను, ట్రెండీ స్టైల్స్ ను త్యాగం చేసినట్టున్నారు.మరి వర్క్ అవుట్ అవుతుందో లేదో చూడాలి.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago