Dhee Show : తెలుగులో ఈటీవీలో వస్తున్న డాన్సింగ్ రియాలిటీ షో ఢీ. ఢీ షో ద్వారా ఎంతో మంది డాన్సర్స్ ఇప్పుడు పెద్ద కోరియోగ్రాఫర్లుగా మంచి ప్లేసులో లో ఉన్నారు. ఇప్పటికే విజయవంతంగా 13 సీజన్ లు అయిపోయి 14 సీజన్ లో ఉన్న ఈ షోలో ప్రస్తుతం నాలుగు టీంలకు లీడర్స్ ఉన్నారు. నవ్య స్వామి, కిరణ్ మచ్చా, ఆది, రవి ఉండగా ప్రదీప్ హోస్ట్ గా ఉన్నాడు. ఇక జడ్జెస్ గా ఇన్ని రోజులు జానీ మాస్టర్ ఉండగా లేటెస్ట్ గా గణేష్ మాస్టర్, శ్రద్ధ దాస్, నందిత జడ్జెస్ గా వ్యవహారిస్తున్నారు.
ఏడ్చి షో నుండి వెళ్లిపోయిన శ్రద్ధ దాస్…
ఇక షోలో కపుల్స్, సోలో, ఛాంపియన్స్, లేడీ టీమ్స్ గా నాలుగు టీమ్స్ ఉన్నారు. ఇక ఒక పెర్ఫార్మన్స్ అయ్యాక శ్రద్ధ డాన్స్ ను ప్రశంసించి వారితో కలిసి డాన్స్ చేసింది. దీంతో కిరణ్ మచ్చా కోపం తో మీరు పార్షియాలిటీ చూపిస్తున్నారు అంటూ ఆరోపిస్తాడు, ప్రదీప్ నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తే నీ ఓర్లుడు ఏంది అని అంటాడు. ఇక శ్రద్ధ ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుంది. ఇక ఆది మధ్యలో సర్ది చెప్పడానికి ప్రయత్నిస్తే నీ కామెడీలు నా దగ్గర చేయకు అంటూ కిరణ్ మచ్చా అనడంతో ఒక్కసారిగా షోలో టెన్షన్ వచ్చేసింది.
ఇక ప్రోమో గురించి నెటిజన్స్ మాత్రం సీరియస్ గా తీసుకోలేదు. ఇలాంటివి చాలా చూసాములే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక నిజంగా అంత సీరియస్ గొడవ జరిగిందా లేక రేటింగ్ కోసం స్టంట్లు చేస్తున్నారో తెలియాలంటే మాత్రం ఎపిసోడ్ చూడాల్సిందే. ఇప్పటికి చాలా సార్లు ఎమోషనల్ ప్రోమోలు, గొడవల ప్రోమోలు ఇలా విడుదల చేయడంతో ప్రేక్షకులు కూడా పెద్దగా సీరియస్ గా పట్టించుకోవడం మానేశారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…