Categories: FeaturedGeneral News

గంటలో సైకిల్.. బైక్ అయిపోతుంది..!సరికొత్త డివైజ్ తో ఆనంద్ మహీంద్ర దృష్టిని ఆకర్షించిన ద్రువ్..!

ఆనంద్ మహీంద్ర.. ఇండియన్ బిజినెస్ మ్యాన్. తన కంపెనీ నుంచి ఎప్పటికప్పుడు నూతన వాహనాలకు రూపకల్పన చేయడమే కాదు.. దేశ నలుమూల్లో ఎక్కడ టాలెంట్ ఉన్నా చేయూతనివ్వడంలో ముందుంటాడు. తాజాగా ఈ వ్యాపార దిగ్గజం తన ట్విట్టర్ ఖాతాలో ఓ ఇంట్రెస్టింగ్ వీడియో షేర్ చేశాడు. ఈ కాన్సెప్ట్ తనకు ఎంతగానో నచ్చిందని.. ఇందులో పెట్టుబడులు పెట్టడానికి తనకు ఎంతో ఆసక్తి ఉందని వెల్లడించాడు. ఇంతకీ ఆనంద్ మహింద్ర మన్ననలు పొందిన విషయం ఏంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

దేశంలో పెట్రో ఉత్పత్తుల ధరలు రోజు రోజుకు భారీగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత మార్కెట్ లోకి ఎలక్ట్రికల్ వాహనాలు విడుదల అవుతున్నాయి. పలు రకాల ఎలక్ట్రికల్ బైకులు, కార్లు ఇప్పటికే వినియోగదారులకు అందుబాటులోకి వచ్చాయి. మంచి ఫీచర్స్ తో, అంతకు మించిన ఆకర్షణతో రోజు రోజుకు కొత్త వాహనాలు రిలీజ్ అవుతున్నాయి. తాజాగా ఆనంద్ మహింద్ర షేర్ చేసిన వీడియోలో ఓ వ్యక్తి సైకిల్ బైక్ ను తయారు చేశాడు. ఆయన తయారు చేసిన ఓ డివైజ్ సైకిల్ కు అమర్చితే మంచి బైక్ రెడీ అవుతోంది. సైకిల్ ను బైక్ గా మార్చే ప్రక్రియ కేవలం గంట సమయంలోనే కంప్లీట్ కావడం విశేషం.

ఈబైక్ ను తయారు చేసిన వ్యక్తి పేరు గుర్ సౌరభ్ సింగ్ ద్రువ్. ఈయన తయారు చేసిన ఎలక్ట్రికల్ కన్వర్షన్ డివైజ్ పట్ల ఆనంద్ మహీంద్ర ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. సౌరభ్ అద్భుతమైన టాలెంట్ ఉన్న వ్యక్తి అన్నాడు. సైకిల్ ను మోటరైజ్ చేసే డివైజ్ ఇదే తొలిది కాకపోవచ్చు. కానీ.. అద్భుతమైనది అని వెల్లడించాడు. ఇది చాలా సేఫ్టీ కలిగిన డివైజ్ అన్నాడు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఈ డివైజ్ పని చేస్తుందని చెప్పాడు.

అటు సౌరభ్ ఈ డివైజ్ ను ఎయిర్ క్రాప్ట్ లో ఉపయోగించే అల్యూమినియంతో తయారు చేశాడు. ఎప్పటికీ తుప్పు పట్టదు. 20 నిమిషాల్లో 50 శాతం చార్జింగ్ అవుతుంది. గంటకు 25 కిలోమీటర్ల వేగంతో వెళ్లవచ్చు. అంతేకాదు.. వాన నుంచి మంట నుంచి ఈ డివైజ్ తట్టుకుంటుంది. అంతేకాదు.. ఈ డివైజ్ ను సకిల్ కు అమర్చేందుకు ఎలాంటి కట్టింగ్, వెల్టింగ్ అవసరం ఉండదు. ఈ డివైజ్ మరింత డెవలప్ చేసేందుకు పెట్టుబడి పెట్టనున్నట్లు ఆనంద్ మహీంద్ర వెల్లడించాడు. లాభాల కంటే.. ఇలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేయడం గర్వంగా ఉంటుందన్నాడు. ఇప్పటికే ఈ డివైజ్ రూపొందించిన సౌరభ్ తో మాట్లాడినట్లు చెప్పాడు.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

7 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago