Son Of India Movie: కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నటించిన సన్ ఆఫ్ ఇండియా మూవీ గురించి అందరికీ తెలిసిందే. ఓటీటీ కోసం నిర్మించిన ఈ చిత్రాన్ని మోహన్ బాబు థియేటర్లో విడుదల చేయాలని పట్టుబట్టి ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమా 265 థియేటర్లలో విడుదలయింది.
కేవలం ఒకటిన్నర గంట నిడివిగల ఈ సినిమా సరికొత్త కాన్సెప్ట్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో మోహన్ బాబు తెలియజేశారు. డైమండ్ రత్నబాబు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాటరీ సమస్థలు కలిపి ఈ చిత్రాన్ని నిర్మించాయి.
ఈ విధంగా ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు రావడంతో నిన్ననే ఈ సినిమా అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి.ఈ క్రమంలోనే రెండు తెలుగు రాష్ట్రాలలో కలిపి ఈ సినిమాకు వంద టికెట్లు కూడా బుక్ కాకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ పరిస్థితి ఇలా ఉంటే ఇక ఈ సినిమా విడుదలైన తర్వాత ప్రేక్షకులు ఈ సినిమాను చూడటానికి వస్తారా అనే సందేహం కూడా కలుగుతుంది. కేవలం అతి తక్కువ నిడివిగల ఈ సినిమాని ప్రేక్షకులు చూడటానికి ఇష్ట పడుటలేదా? నేటి నుంచి ఆంధ్రప్రదేశ్ లో 100% ఆక్యుపెన్సీతో థియేటర్లు రన్ కానున్నాయి. ఈ క్రమంలోనే 265 థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఇలాంటి చేదు అనుభవాన్ని ఎదుర్కోవడం టాలీవుడ్ చరిత్రలోనే ఇదే మొదటి సినిమా.ఓటీటీ కోసం నిర్మించిన ఈ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేసి ఉంటే కొంచెం అయినా గౌరవం ఉండేదని పలువురు వారి అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…